వనపర్తి, మార్చి 4 (నమస్తే తెలంగాణ) : ప్ర భుత్వ దవాఖానల్లో గతంలో మాదిరి మందుల స రఫరా లేక పేద ప్రజలు అవస్థలు పడుతున్నారు. సర్కారు దవాఖానలకు వెళ్లే సగం మంది రోగులు బయటే మందులు కొంటున్నారు. ఈ క్రమంలో ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి బహిరంగసభ పాలిటెక్నిక్ మైదానంలో జరిగిన సంగతి విధితమే. సీఎం రాక సందర్భంగా వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేకంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసింది. ఈ శిబిరంలో ఓఆర్ఎస్ ప్యాకెట్లతోపాటు మరో 20రకాల మందుల ను అందుబాటులో ఉంచారు. అంతవరకు బాగా నే ఉంది.
అయితే.. సీఎం సభ అనంతరం మెడిక ల్ సిబ్బంది ఆ శిబిరంలో ఉన్న మందులను అక్క డే వదలి వేయడంతోపాటు, మరికొన్ని మందుల ను కాల్చి వేసిన ఘటన ఆలస్యంగా వెలుగు చూ సింది. కాగా, మైదానంలో శిబిరాలను తొలగిస్తున్న క్రమంలో కొంత ఆలస్యంగా ఇది బయట పడింది. వైద్య సిబ్బంది చేసిన నిర్వాకాన్ని చూసిన పలువు రు అధికారులకు సమాచారం ఇచ్చారు.
అప్పటికే మందులు కాలిపోవడం, మరికొన్ని మట్టిలో కలిసి పోవడం, ఇంకా కొన్ని అటు.. ఇటుగా పడిపోవడం జరిగింది. సీఎం సభలో ప్రజల కోసం అత్యవసర పరిస్థితిని గుర్తించి ఏర్పాటు చేసిన శిబిరంలో తెచ్చి న మందులను వదిలేసిన నిర్లక్ష్య ఘటనపై జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారులు సైతం సమర్థనీయంగానే వ్యవహరించడం విమర్శలకు దారి తీ సింది. జిల్లా కేంద్రంలోనే ఇంతలా సీఎం సభలో నిర్లక్ష్యం ఉంటే ఇక లోపల ఎలా ఉంటుందో అన్న సందేహాలు వెల్లడవుతున్నాయి.
తప్పు జరిగింది..
సీఎం సభ ఏర్పాటు సందర్భంగా పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం లో విధులు నిర్వహించిన సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సభ ముగిసిన వెంటనే తీసుకెళ్లాల్సి ఉండే సిబ్బంది తప్పు చేశారు. వి షయం తెలిసిన వెంటనే మిగిలిన మందులను తెప్పించాం. కొన్ని ఓఆర్ఎస్ పాకెట్లు, మరికొన్నింటిని దగ్ధం చేశారు. హడావుడిలో సిబ్బంది ఇంటికి వెళ్లిపోవడం వల్ల శిబిరంలోని మం దులు అక్కడే ఉండిపోయాయి.
– శ్రీనివాసులు, జిల్లా వైద్య,ఆరోగ్య శాఖ అధికారి, వనపర్తి