మహబూబ్‌నగర్‌టౌన్, డిసెంబర్ 30 : మహిళల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం క్యాంప్ కార్యాలయంలో మహబూబ్‌నగర్ అర్బన్ మండలంలోని 165 మంది లబ్ధిదారులకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మె ల్యే పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదలకు షాదీముబారక్, కల్యాణలక్ష్మి పథకం ఎంతో ఉపయోగపడుతుందని తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం సీఎం రేవంత్‌రెడ్డి అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో అనీల్‌కుమార్, అర్బన్ తాసీల్దార్ రాధాకృష్ణ, కౌన్సిలర్ లతశ్రీ, నాయకులు సిరాజ్‌ఖాద్రీ, సురేందర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, సీజే బెనహర్, లక్ష్మణ్‌యాదవ్ పాల్గొన్నారు.
అర్హులందరికీ సంక్షేమ ఫలాలు
ప్రజాసంక్షేమ పథకాలు అర్హులకు అందేలా కృషి చేస్తామని మహబూబ్‌నగర్ ఎ మ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. శనివారం మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డు బీకేరెడ్డి కాలనీ, 29వ వార్డు మదీనమసీదు ప్రాంతాల్లో ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారెంటీల కోసం అర్హులైన వారు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ప్రతిఇంటికీ దరఖాస్తులు అందజేయాలని, రద్దీ లేకుండా కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. అలాగే ఆల్ఫైజ్ వెల్ఫేర్ సొసైటీ రూపొందించిన నూత న సంవత్సర క్యాలెండర్‌ను శనివారం జిల్లా కేంద్రంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఆవిష్కరించారు. కార్యక్రమంలో కలెక్టర్ జి.రవినాయక్, ఆర్డీవో అనీల్‌కుమార్, మున్సిపల్ కమిషనర్ ప్రదీప్‌కుమార్, కౌన్సిలర్లు ఆనంద్‌కుమార్‌గౌడ్, మోయిన్‌అలీ, కౌన్సిలర్లు, ఆల్ఫైజ్ వెల్ఫేర్ అధ్యక్ష, కార్యదర్శులు జహంగీర్‌బాబా, మహ్మద్యాకుబ్, మహమూద్ పాల్గొన్నారు.