నాగర్ కర్నూల్: ప్రభుత్వ ఫలాలను లబ్దిదారులు సద్వినియోగం చేసుకోవాలని నాగర్కర్నూల్ ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి (MLA Rajesh Reddy) అన్నారు. శుక్రవారం నాగర్ కర్నూల్ లోని క్యాంపు కార్యాలయంలో నాగర్ కర్నూల్ టౌన్, మండలం, తెల్కపల్లి మండలానికి సంబంధించిన 150 లబ్దిదారులకు కల్యాణ్లక్ష్మి (Kalyan Lakshmi) , షాదీ ముబారక్ , 46 మందికి సీఎంఆర్ఎఫ్ (CMRF ) చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాజేష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలకు సంక్షేమ పథకాలను అందిస్తుందని వెల్లడించారు. పేద కుటుంబాల్లో అమ్మాయిల పెళ్లిళ్లు తల్లిదండ్రులకు భారం కాకూడదనే ఉద్దేశంతో ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించడంతో పాటు, ప్రతి అమ్మాయి జీవితాన్ని వెలుగులు నింపేలా చేయడం ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
అనారోగ్యంతో బాధపడుతున్న వారు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు సీఎంఆర్ఎఫ్ ఎంతో ఉపయుక్తంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, మండలాల అధ్యక్షులు, పట్టణ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు, యువజన నాయకులు, మహిళ నాయకులు పాల్గొన్నారు.