Harish Rao | వెల్దండ, జూన్ 3: తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి మంగళవారం మాజీ మంత్రి హరీష్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని మాజీ మంత్రి హరీష్ రావు నివాసంలో ఆయనను కలిసిన గోలి శ్రీనివాసరెడ్డి శాలువాతో సన్మానించారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా.. స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలిపారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు సురమల్ల సుభాష్, శ్రీకాంత్ తదితరులు ఉన్నారు.