తాళం వేసిన ఇంటికి కళ్లెం
తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్నది. టుటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు.. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో జగ్జీవన్‌రాం నగర్‌కు చెందిన రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగి కృష్ణయ్య కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు.
- 28 తులాల బంగారం, రూ.70వేల నగదు, స్కూటీ చోరీ
మహబూబ్‌నగర్ మెట్టుగడ్డ, డిసెంబర్ 6: తాళం వేసిన ఇంట్లో భారీ చోరీ జరిగిన ఘటన జిల్లాకేంద్రంలో చోటుచేసుకున్నది. టుటౌన్ సీఐ ప్రవీణ్‌కుమార్ కథనం మేరకు.. పట్టణంలోని బస్టాండ్ సమీపంలో జగ్జీవన్‌రాం నగర్‌కు చెందిన రిటైర్డ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉద్యోగి కృష్ణయ్య కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నారు. ఆదివారం హైదరాబాద్‌లోని ఓ శుభాకార్యంలో పాల్గొనేందుకు కుటుంబసభ్యులతో కలిసి ఇంటికి తాళంవేసి వెళ్లా రు.
ఇంట్లో ఎవరూ లేని సమయంలో సోమవారం రాత్రి దుండగులు ఇంటితాళం విరగ్గొట్టి బీరువా లాకర్లో ఉన్న 3తులాల బంగారు పుస్తెలతాడు, 8 బంగారు గాజులు, ఉంగరాలు, చేతి ఉంగరాలు, కమ్మలు, 6 తులాల బంగా రు గొలుసులతోపాటు వివిధ రకాల బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు, రూ.70వేల నగదు, స్కూటీతో పరారయ్యారు.
కుటుంబసభ్యులు మంగళవారం తెల్లవారుజామున వచ్చి చూసేసరికి త లుపులు తెరిచి ఉండడంతోపాటు బీరువా తాళం విరగ్గొట్టి ఉండడంతో టుటౌ న్ పోలీస్‌స్టేషన్‌కు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి సీఐ వెళ్లి పరిసరా లు పరిశీలించి బాధితులతో వివరాలు సేకరించారు. క్లూస్ టీంతో ఫింగర్‌ప్రింట్స్ ఆధారాలు సేకరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.
Read Today's Latest Mahabubnagar News in Telugu and Telugu News
- Tags
- gold
- Locked House
RELATED ARTICLES
తాజా వార్తలు
Jailer 2 | రజనీకాంత్ అభిమానులకు గుడ్ న్యూస్ ..తెలంగాణలో సాధారణ టికెట్ ధరలకే ‘జైలర్ 2’..
Mamitha Baiju | ‘జై హనుమాన్’లో మమితా బైజు.. రిషబ్ శెట్టి, రానా సరసన కీలక పాత్రలో కనిపించనుందా?
Donald Trump: రష్యా నుంచి డీజిల్ కొంటామన్న ట్రంప్.. పుతిన్‌కు గిఫ్ట్ ఇచ్చారన్న జెలెన్స్కీ
Ramayana | కైకేయిగా లారా దత్తా, మంథరగా షీబా.. ‘రామాయణం’ నుంచి ఫస్ట్ లుక్స్ విడుదల
Drishyam 3 | ‘దృశ్యం 3’ బాక్సాఫీస్ సునామీ.. 8 రోజుల్లోనే రూ. 400 కోట్లు!
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

