జనరిక్ మందులంటే.. మందు బిల్లలను తయారు చేసిన సంబంధిత కంపెనీ నేరుగా మెడికల్ దుకాణాల ద్వారా విక్రయించేలా సరఫరా చేస్తారు. ఇవి అతి చౌక ధరకే లభిస్తాయి. కానీ మెడికల్ షాపుల యజమానులు బ్రాండెడ్ పేరుతో ప్రజల జేబులు గుల్ల చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే మందు బిల్లల కొనుగోలు భారం పేదలపై పడరాదని భావించిన ప్రభుత్వం జనరిక్ మందుల విక్రయాలు చేపట్టింది. ఇందులో భాగంగా ప్రతి మందుల షాపులో 30 శాతం మేరకు జనరిక్వే విక్రయించాలి. బ్రాండెడ్ ట్యాబ్లెట్ స్లిప్ ఒకటి మార్కెట్లో రూ.50కి లభిస్తే.. ఐదారు రూపాయలకే జనరిక్ మందులు లభిస్తాయి. కానీ కొందరు వీటిని బ్రాండెడ్ స్థాయిలో విక్రయిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఈ మందుల విషయంలో ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పిస్తే వారికి తక్కువ ధరకే మందుబిల్లలు లభిస్తాయి.
మహబూబ్నగర్ మెట్టుగడ్డ, ఆగస్టు 17 : చౌక ధరలకు లభించే జనరిక్ మందులపై ప్రజలకు అవగాహన లేకపోవడంతో బ్రాం డెండ్ పేరిట మెడికల్ షాపుల నిర్వాహకులు రోగులను బాదేస్తున్నారు. మహబూబ్నగర్ ఉమ్మడి జిల్లాలో సుమారుగా 1,400 మెడికల్ రిటైల్, హోల్ సెల్ మెడికల్ దుకాణాలున్నాయి. ఒక జనరిక్ మందుల దుకాణం ఉండగా, మరొకటి కేంద్ర ప్రభుత్వం అధీనంలో నిర్వహిస్తున్న జీవన్ధార్ మెడికల్ దుకాణం ఉంది. వందల సంఖ్యలో ప్రైవేట్ మెడికల్ దుకాణాలుండగా, కేవలం జిల్లా అంతటికి ఒకటే జనరిక్ మెడికల్ దుకాణం ఉండడం గమనార్హం. మెడికల్ దుకాణాల్లో విధిగా మందుల ధరల సూచించే పట్టికను ఏర్పాటు చేయాల్సి ఉండగా, ఎక్కడా కనిపించడం లేదు. ఇంత జరుగుతున్నా ఔషధ నియంత్రణ శాఖాధికారులు చూసిచూడనట్లు వ్యవహరించడంపై పలు అనుమానాలకు తావిస్తోంది. అధికారులకు మాముళ్లు ముట్టచెప్పడంతో మెడికల్ దుకాణాల వైపు కన్నెత్తి చూడడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇకనైనా అధికారులు క్షేత్రస్థాయిలో దాడులు నిర్వహిస్తే పేద, మధ్య తరగతి ప్రజలకు కొంతయినా ప్రమోజనం చేకూరుతుంది.
ప్రజలకు చౌక ధరల్లో మందులు అందుబాటులో ఉండేలా జనరిక్ మందులపై ఆవగాహన కల్పించాల్సి ఉంది. మందుమూల పదార్థం, పేరుతో విక్రయించే జనరిక్ మందులు బ్రాండెడ్ మందుల కంటే 20 నుంచి 80 శాతం వరకు తక్కువ ధరల్లోనే లభిస్తాయి. డ్రగ్స్ అండ్ కాస్మోటిక్ చట్టం నిర్ధేశించిన నాణ్యత, రసాయన ప్రమాణాలు కూడా ఈ జనరిక్ మందులు కలిగి ఉన్నా వైద్యులకు అవేవీ పట్టింపు లేకుండా పోయింది. వీటిపై పన్నుభారం తక్కువగానే ఉండడంతో చౌక ధరల్లోనే లభిస్తాయి. ఫార్మా కంపెనీలు బ్రాండెడ్ మందులతోపాటు జనరిక్ మందులను కూడా తయారు చేస్తాయి. బ్రాండెడ్ మందుల్లోనే అధిక లాభాలు రావడంతో అటు వైపు మొగ్గుచూపుతున్నాయి. కొందరు జనరిక్ మందులను బ్రాండెడ్ మందుల స్థాయిలోనే విక్రయిస్తున్నారు. దీంతో రోగులు నష్టపోతున్నారు. అయితే ప్రతి మెడికల్ దుకాణంలో 30 శాతం మేరకు జనరిక్
జనరిక్ మందులు తక్కువ ధరలో లభించడంతోపాటు నాణ్యమైనవి కూడా. జనరిక్ మందుల వాడకంపై ప్రజల్లో అపోహలకు గురికాకుండా అవగాహన కల్పిస్తున్నాం. వివిధ రకాల బ్రాండ్ల పేర్లతో అమ్మినా రెండూ ఒక్కటే. జనరిక్ మందులు ప్రజలకు తక్కువ ధరలకు లభిస్తాయి.
– దినేశ్, డ్రగ్స్ కంట్రోల్ అడిషనల్ డైరెక్టర్, మహబూబ్నగర్