మహబూబ్‌నగర్, జనవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : త్వరలో సార్వత్రిక (పార్లమెంట్) ఎన్నికలు రానుండడంతో అన్ని పార్టీలు ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెం ట్ స్థానాలపై కన్నేశాయి. ఈ ఎన్నికలను అందరూ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీ జేపీ నేతల మధ్య టికెట్ల పోరు తారాస్థాయికి చేరింది. తెరవెనుక ఉన్న నేతలు తెర ముందుకొస్తున్నారు. కొత్త సం వత్సరం, పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు ఏ ర్పాటు చేయడంతో ఆయా పార్టీల క్యాడర్లో ఎంపీ అభ్యర్థులపై చర్చలు మొదలయ్యాయి. కొందరు నేతలు తమకే టికెట్ వస్తుందని ప్రచారం చేసుకుంటున్నారు. ఎన్నికలకు అధికార యంత్రాంగం కూడా సిద్ధమవుతుండడంతో నేత ల్లో టెన్షన్ మొదలైంది. పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా ఆ యా పార్టీలు వ్యూహ రచనలు చేస్తున్నాయి. 2019లో జ రిగిన పార్లమెంట్ ఎన్నికల్లో ఉమ్మడి మహబూబ్‌నగర్ జి ల్లాలోని రెండు స్థానాలను గులాబీ దళం చేజిక్కించుకున్నది. ప్రస్తుతం కూడా అదే సీన్ రిపీట్ చేయాలని భావిస్తున్నది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీతో ఓడిపోయినప్పటికీ ఓటర్లలో ఆదరణ తగ్గలేదు. ఈసారి ఎంపీ ఎలక్షన్లు కలిసి వస్తాయని పార్టీ నేతలు భావిస్తున్నారు. ప్రస్తుతం మహబూబ్‌నగర్ ఎంపీగా మన్నె శ్రీనివాస్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీగా రాములు కొనసాగుతున్నారు. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఎంపీ స్థానాలకు గడు వు ముగియనున్నది. ముందస్తు ఎన్నికలు జరుగుతాయనే ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో ఆయా పార్టీల నేతలు పార్లమెంట్ ఎన్నికలపై గురిపెట్టారు.
ముందస్తా..? షెడ్యూల్ ప్రకారమేనా..?
పార్లమెంట్ ఎన్నికలు ఏప్రిల్, మే నెలలో షెడ్యూల్ ప్ర కారమే జరుగుతాయా? లేక ముందస్తు ఎన్నికలు వ స్తాయా అనేది చర్చనీయాంశంగా మారింది. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ఈనెలలోనే రామ మందిరం ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేసింది. ఆలయ ప్రారంభోత్సవం జరగగానే కేంద్రంలో ఉన్న ప్రభుత్వాన్ని రద్దుచేసి ముందస్తుకు వెళతారని ప్రచారం జోరుగా సాగుతోంది. ఇ దే జరిగితే మార్చిలోనే ఎన్నికలు జరిగే అవకాశం ఉంది. ఒకవేళ కేంద్రం ముందస్తుకు వెళ్లకపోతే ఏప్రిల్ నెలలో ఎ లాగూ పార్లమెంట్ సభ్యుల పదవీకాలం పూర్తవుతుంది. పోలింగ్ చేపట్టాల్సి ఉండడంతో మే వరకు పూర్తిచేయాల్సి ఉంటుంది. దీంతో ఈసారి పార్లమెంట్ ఎన్నికల ముఖచి త్రం ఏ విధంగా ఉండబోతుందనేది చర్చనీయాంశంగా మా రింది. అసెంబ్లీ ఎన్నికలకు పార్లమెంట్ ఎన్నికలకు ఓటింగ్ డిఫరెంట్‌గా ఉండటం ఉమ్మడి పాలమూరు జిల్లా ప్రత్యేక త. గత రెండు పర్యాయాలు ఇదే జరిగింది. ఈసారి కూడా అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరి కాకుండా పార్లమెంటుకు విభి న్న తీర్పు వస్తుందని భావిస్తున్నారు. దీంతో ఈ ఎన్నికలు బీఆర్ఎస్కే కలిసి వస్తాయని విశ్లేషకుల అంచనా. మరోవైపు బీజేపీ, కాంగ్రెస్ మధ్య కూడా పోటీ పెరిగి బీఆర్ఎస్కు చాన్స్ దొరికే అవకాశం ఉందని అంటున్నారు.
ఎంపీ టికెట్ల కోసం కసరత్తు..
మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాల నుంచి పోటీ చేసేందుకు అన్ని పార్టీలు సం సిద్ధంగా ఉన్నాయి. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలో ఎంపీ టికెట్ల కోసం ఇప్పటినుంచే పైరవీలు ప్రారంభించారు. మహబూబ్‌నగర్ జనరల్ స్థానం నుంచి సిట్టింగ్ ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డికే చాన్స్ దక్కుతుందని అందరూ భావిస్తున్నారు. సౌమ్యుడిగా, మృధుస్వభావిగా పేరున్న ఆయన కుటుంబం ఈ ప్రాంతంలో పారిశ్రామికవేత్తలుగా చలామణి అవుతున్నారు. ప్రజాసేవే పరమావధిగా పనిచేస్తున్నది. గత అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే ఈసారి కూడా ఆ కుటుంబం నుంచి ఎంపీగా పోటీ చేస్తారని, పార్టీ మారుతున్నారని దుష్ప్రచారం ప్రారంభించారు. అలాంటిదేమీ లేదని ఆ కుటుంబం కొట్టి పారేసింది. కాంగ్రెస్ పార్టీ చీప్ ట్రిక్కులకు పాల్పడుతుందని బీఆర్ఎస్ నేతలు మండిపడుతున్నారు. ఇక నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానానికి సిట్టింగ్ ఎంపీ రాములు ఇంట్రెస్ట్ లేకపోతే అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజును రంగంలోకి దింపాలని బీఆర్ఎస్ భావిస్తున్నది. 2009 ఎన్నికల్లో చాలా తక్కువ మెజార్టీతో ఓటమి పాలయ్యారు. ఇక మహబూబ్‌నగర్ పార్లమెంట్‌కు కాంగ్రెస్ నుంచి కల్వకుర్తికి చెందిన మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, నాగర్‌కర్నూల్ ఎస్సీ రిజర్వుడు పార్లమెంట్‌కు జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే మల్లురవి పోటీ పడుతున్నారు.
రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్రలో వంశీచంద్ కీలకంగా వ్యవహరించడం తో ఆయనకే టికెట్ వస్తుందని భావిస్తున్నారు. మ రోవైపు పార్లమెంట్ పరిధిలో ఆయన పేరు మీద ఫ్లెక్సీలు కూడా వెలిశాయి. మరోవైపు జడ్చర్ల టికెట్ కోసం పార్టీ ఆదేశాలను పాటించిన మల్లురవి కూ డా ఎంపీగా పోటీ చేస్తానని అనుచరుల వద్ద అం టున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం ఆశీస్సులు తనకే ఉన్నాయని టికెట్ ఖాయమని అంటున్నారు. కా గా ఈ పార్లమెంట్ నుంచి కొత్త క్యాండిడేట్లు వస్తున్నారని వారంతా బీఆర్ఎస్ పార్టీ నుంచి జంప్ అ వుతున్నారని ఆ పార్టీ కొన్ని పత్రికల్లో చీప్ ట్రిక్స్ ప్లే చేయడం ప్రారంభించింది. బీజేపీ నుంచి మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి, పార్టీ కోశాధికారి శాంతకుమా ర్, మాజీ మంత్రి డీకే అరుణ పోటీ పడుతున్నారు. ఎవరికి వారే టికెట్లు తమకే వస్తాయనే ధీమాతో ఉన్నారు. ఇక నాగర్‌కర్నూల్ స్థానం నుంచి బీజేపీకి పోటీ చేసే అభ్యర్థులే కరువయ్యారు. గతంలో పోటీ చేసిన కేంద్ర మాజీ మంత్రి బంగారు లక్ష్మణ్ కూతురు బంగారు శృతిని మళ్లీ రంగంలో దింపేందుకు ఆ పార్టీ యోచిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలే ఎజెండాగా..
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను పూర్తిస్థాయిలో ఎండగట్టాలని భావిస్తున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించాక కేసీఆర్ ప్రభుత్వం పదేండ్ల కాలంలో చే సిన అభివృద్ధి పథకాలు సంక్షేమ కార్యక్రమాలను కొత్తగా అధికారంలో వచ్చిన కాంగ్రెస్ పార్టీ తుంగ లో తొక్కడం.. రైతుబంధు పైసలు జమ చేయకపోవడం.. దళితబంధును ఆపేయడం.. గృహలక్ష్మి ని రద్దు చేయడం వంటి అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు పిలుపునిస్తున్నారు. ఆరు గ్యారెంటీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ 30 రోజులు దాటుతున్నా ప్రజలకు ఇచ్చిన హా మీలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమైందని ఈ విషయాన్నీ ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని అం టున్నారు. మరోవైపు బీఆర్ఎస్ క్యాడర్ చెక్కు చెదరలేదనడానికి వార్డు మెంబర్ కూడా పార్టీ మారకపోవడమే ఇందుకు నిదర్శనమని అంటున్నారు. ప్రజాపాలన పేరుతో కాంగ్రెస్ పార్టీ దగా చేసిందని శ్వేతపత్రాల పేరుతో తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బకొట్టే ప్రయత్నం చేస్తున్న విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని కార్యకర్తలకు సూచిస్తున్నారు. అంతేకాక పింఛన్లు ఇంకా జమ చేయకపోవడం, సం క్షేమ పథకాల అమలులో దరఖాస్తుల పేరిట కాలయాపన చేయడం వంటి అంశాలను కూడా ప్రజ ల్లోకి తీసుకెళ్లాలని క్యాడర్‌కు చెబుతున్నారు. యా సంగి పంటకు క్రాప్ హాలిడే ఇవ్వడం.. విద్యుత్ కో తలు షురూ కావడం వంటి అంశాలను విస్తృతం గా ప్రచారం చేయడంతోపాటు బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమనే విషయాలను ప్రజల్లోకి బలంగా తీసుకువెళ్లాలని భావిస్తున్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించడంలో పూర్తిగా విఫలం కావడం.. ఈ ఎన్నికలను నిర్వహించలేని వారి చేతకానితనాన్ని బయట పెట్టాలని సూచిస్తున్నారు.
బీఆర్ఎస్ పక్కా స్కెచ్..
ఈసారి పార్లమెంట్ ఎన్నికలే లక్ష్యంగా బీఆర్ఎస్ పార్టీ పావులు కదుపుతున్నది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ స్థానాలను ఎలాగైనా కైవసం చేసుకోవాలని పార్టీ నేతలు భావిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీకి కొంత మేర న ష్టం జరిగినా.. స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, ఎంపీపీ లు, జిల్లా పరిషత్ చైర్మన్లు, మున్సిపల్ చైర్మన్ ఇం కా పార్టీ వైపే ఉండడంతో ఎంపీ ఎలక్షన్లలో కలిసొస్తుందని భావిస్తున్నారు. ఈ మేరకు కిందిస్థాయి క్యాడర్ నుంచి పార్టీ శ్రేణులను బలోపేతం చేసేందుకు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియోజకవర్గస్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎ న్నికల్లో పార్టీపై వచ్చిన దుష్ప్రచారాన్ని తిప్పికొట్టకపోవడం.. తెలంగాణ తెచ్చిన పార్టీ అభివృద్ధిని ప్ర జలకు వివరించడంలో కొంచెం వెనుకబడినప్పటికీ ఓట్లశాతంలో మాత్రం ముందే ఉన్నామని క్యాడర్‌కు విశదీకరిస్తున్నారు. దీంతో కిందిస్థాయి క్యాడ ర్లో మరింత జోష్ నింపేందుకు పార్లమెంట్ ఎన్నికలు ఉపయోగపడతాయని నేతలు భావిస్తున్నారు.