ఐదు రోజులుగా వాడవాడలా పూజలందుకున్న గణనాథుడు వీడ్కోలు పలికాడు. ముందుగా ఆయా మండపాల వద్ద వినాయకుడి వద్ద ఉంచిన లడ్డూలు, స్వామి వస్ర్తాలకు వేలం నిర్వహించారు.
పలుచోట్ల యువత ఉట్లు కొట్టి సంబురాలు చేసుకున్నారు. అనంతరం ముచ్చటగా అలంకరించిన వాహనాల్లో విగ్రహాలను ఉంచి డీజే, కోలాటాలు, సంప్రదాయ నృత్యాల మధ్య నిమజ్జనానికి తరలించారు.