వడ్డేపల్లి (గద్వాల జోగులాంబ జిల్లా) : పెళ్లింట విషాదం నెలకొంది. వడ్డేపల్లి మండలం బుడమొర్సు గ్రామానికి చెందిన మురళి అనే యువకుడు రోడ్డు ప్రమాదంలో మరణించాడు. పెళ్లికి వచ్చిన ఇద్దరు బందువులను శాంతినగర్లోవదిలిట్టడానికి బైక్‌పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. తెల్లవారుజామున 5 గంటల సమయంలో శాంతినగర్‌లోని హర్షిత బార్ అండ్ రెస్టారెంట్ వద్ద పొగాకు లోడుతో ఎదురుగా వచ్చిన బొలెరో వాహనం(AP16TF7999) ఢీకొట్టడంతో మురళి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.