ఉండవెల్లి: అలంపూర్ మండలం సింగవరం2 గ్రామానికి చెందిన బొయ బాల ఈశ్వర్ అనారోగ్యంతో మృతి చెందాడు. దీంతో అలంపూర్ చౌరస్తాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నామిని లక్ష్మిదేవికి ఐదు లక్షల రూపాయల చెక్‌ను ఎమ్మెల్యే అబ్రహం పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతు శ్రేయస్సు కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ఆమలు చేయడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ భర్త సాయిబాబా, ఉమశంకర్, విజయ్‌కిరణ్, లోకేశ్‌కుమార్ పాల్గొన్నారు.