ఉండవెల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాపాలనలో దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నారని ఎమ్మెల్యే అబ్రహం పేర్కొన్నారు. మండలం లోని అలంపూర్ చౌరస్తా ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే అబ్ర హం, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ విలేఖరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీనే రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్షగా నిలిచిందన్నారు.
భారతదేశంలో తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తూ, పార్టీని పఠిష్ట పరుస్తూ ప్రతిపక్షం లేకుండా చేసిన ఘనత కేసీ ఆర్కే దక్కిందని ఎమ్మెల్యే అన్నారు. గులాబీ జెండా కార్యకర్తలకు అండగా నిలిచిందని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఇంతియాజ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు బైరాపురం రమణ, అలంపూర్ మండలాధ్యక్షుడు బిచుపల్లి, టీఆర్ఎస్ నాయకులు దేవన్న, లోకేశ్వరరెడ్డి, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.