గద్వాల: జోగులాంబ గద్వాల జిల్లా గట్టు మండలం బలిగెర గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. ఆగి ఉన్న ట్రాక్టర్ను బైక్ బలంగా ఢీకొట్టడంతో బైక్పై ప్రయాణిస్తున్న ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతులను కర్ణాటక రాష్ట్రం దేవునిపల్లి గ్రామానికి చెందిన ఉల్లిగప్ప (40) తిమ్మప్ప(38) గా గుర్తించారు.
వీరు ఐజ నుంచి బైక్ పై తమ సొంత గ్రామం దేవునిపల్లికి వెళ్తున్నారు. ఈ క్రమంలో బైక్ ఆగి ఉన్న ట్రాక్టర్లు ఢీ కొట్టింది దీంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం గద్వాల ప్రభుత్వ దవాఖానకు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.