అలంపూర్ చౌరస్తా జులై 24 : అలంపూర్ ప్రజల చిరకాల ఆకాంక్ష అయినటువంటి వంద పడకల దవాఖాన వైద్య సేవలు బుధవారం ప్రారంభం అయ్యాయని అలంపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్ దొడ్డప్ప, వైస్ చైర్మన్ కుమార్ అన్నారు. బుధవారం ఉండవెల్లి మండలం అల్లంపూర్ చౌరస్తాలోని వంద పడకల హాస్పిటల్ వైద్య సేవలను వైద్య బృందం ప్రారంభించింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ఎమర్జెన్సీ సేవలు ఉన్న కర్నూల్ లేదా హైదరాబాద్ పట్టణానికి వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని, ఈరోజు వైద్య సేవలు ప్రారంభం కావడంతో అలంపూర్ ప్రజల చిరకాల స్వప్నం నెరవేరిందని అన్నారు.
అనంతరంహాస్పిటల్లో ఉన్న వైద్యులను, ఏఎన్ఎంలను, స్టాఫ్ ను కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించి స్వీట్లు తినిపించారు. వంద పడకల దవాఖాన సేవలు వినియోగించుకోవాలని..ఇంకా కొంత సామగ్రి, వైద్యులు రావాల్సి ఉందని, ప్రస్తుతానికి సాధారణ ఓపి సేవలు మాత్రమే అందుబాటులోకి ఉంటాయని సివిల్ సర్జన్ డాక్టర్ ప్రవీణ్ తెలిపారు.మరో రెండు నెలల్లో పూర్తిస్థాయిలో అన్ని రకాల వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని, అంతవరకు అలంపూర్ నియోజకవర్గం నుండి వచ్చిన పేషెంట్లు కానీ ప్రజలు కానీ సహకరించాలని కోరారు. కార్యక్రమంలో రమణ, జగన్మోహన్ నాయుడు, గోపాల్, అడ్డాకుల రాము, చంద్రశేఖర్ రెడ్డి, ముక్తార్, రామాచారి తదితరులు ఉన్నారు.