కార్లలో తిరిగేలా పరిస్థితులను మారుస్తాం
నెలకు లక్ష ఆదాయం వచ్చేలా చేస్తాం
ఎక్సైజ్ శాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్
దళితబంధు అమలుపై సమీక్ష
మహహబూబ్‌నగర్, ఫిబ్రవరి 7 (నమస్తే తెలంగాణ ప్ర తినిధి) : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు పథకంతో అత్యంత వెనుకబడిన దళితులు లక్షాధికారులుగా మారనున్నట్లు ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. భవిష్యత్‌లో ఆర్థికంగా నిలదొక్కుకొని కార్లలో తిరిగే పరిస్థితి తీసుకొస్తామన్నారు. జిల్లా కేంద్రంలోని ఎమ్మె ల్యే క్యాంపు కార్యాలయంలో మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో దళితబంధు పథకం అమలుపై అధికారులు, ప్ర జాప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భం గా మంత్రి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చి 75 ఏండ్లు దా టినా ఎస్సీ, ఎస్టీలు అత్యంత దుర్భరమైన బతుకులు వెళ్లదీస్తున్నారన్నారు. దళితులు అన్ని రకాలుగా అభివృద్ధి చెందేందుకు సీఎం కేసీఆర్ దేశంలో ఎక్కడా లేని విధంగా దళితబంధు పథకాన్ని అమలు చేస్తున్నారన్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి ఎలాంటి లబ్ధి పొందని వారిని, అత్యంత పేదరికంలో ఉన్న వారిని గుర్తించాలన్నారు. ఆయా శాఖల అధికారులు, ఎస్సీ, ఎస్టీ ప్రజాప్రతినిధులు ఇందుకు కృషి చేయాలన్నారు. మహబూబ్‌నగర్ నియోజకవర్గంలో అమలుచేసే దళితబంధు పథకం ఆదర్శంగా నిలవాలన్నారు.
స్థానికంగా ఉపాధినిచ్చే రంగాలకు ప్రాధాన్యం..
దళితబంధు పథకం కింద స్థానికంగా ఉపాధినిచ్చే రంగాలకు ప్రాధాన్యత ఇవ్వాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్ అధికారులకు సూచించారు. ఎక్కువ ఆదాయం వచ్చే పాడి, కోళ్ల పరిశ్రమ, గేదెల పెంపకం, ఎరువుల దుకాణాలు, సూపర్ మార్కెట్లు, హాస్టళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలలకు వంట సరుకుల సరఫరా, స్టీల్, సిమెంట్, ఇటుకల దుకాణాల ఏర్పా టు, మెడికల్ షాపులు తదితర పెద్ద వ్యాపారాల యూనిట్ల ను ఏర్పాటు చేయాలన్నారు. ఒక్కో లబ్ధిదారుడికి నెలకు క నీసం రూ.లక్ష ఆదాయం వచ్చేలా యూనిట్లు ఉండాలని, ఇందుకు అధికారులు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. గేదెల పెంపకం, డెయిరీ నిర్వహణకు క్రిస్టియన్‌పల్లి, ఓ బులాయపల్లిలో ప్రభుత్వ భూములను గుర్తించి అందులో షెడ్ల ఏర్పాటుతోపాటు గడ్డి పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహబూబ్‌నగర్ మున్సిపాలిటీలోని విలీన గ్రామా ల్లో కోళ్ల ఫారాల ఏర్పాటుకు ప్రభుత్వ భూమిని గుర్తించాలన్నారు. పట్టణానికి దగ్గర్లో ఉంటే విక్రయాలకు అనుకూలం గా ఉండి ఆదాయం వస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ రెసిడెన్షియల్, కేజీబీవీ పాఠశాలలకు వంట సరుకులు, గుడ్లు, మటన్, చికెన్, కూరగాయల సరఫరాను లబ్ధిదారులకు అప్పగించాలన్నారు. అలాగే అంగన్వాడీ కేంద్రాలకు అవసరమైన ఆహారపదార్థాల సరఫరా కూడా వీరికే ఇచ్చేలా చర్యలు చేపట్టాలని సూచించారు.మహబూబ్‌నగర్,
హన్వా డ మండల కేంద్రాల్లో ఎస్సీ లబ్ధిదారులతో ఎరువుల దుకాణాల ఏర్పాటుకు ఉచితంగా లైసెన్సులు ఇప్పించడం, ఆగ్రో ఫీజు రాయితీ ఇచ్చేలా చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు. బీ ఫార్మసీ చదివిన ఎస్సీ లబ్ధిదారులను ఒక గ్రూపు గా ఏర్పాటు చేసి మెడికల్ షాపులు ఏర్పాటు చేయించాలన్నారు. ఆసక్తి ఉన్న వారితో స్టీల్, సిమెంట్ దుకాణాల నిర్వహణను చేపట్టాలన్నారు. కలెక్టర్, అధికారులు ఆయా శాఖ ల ద్వారా అమలు చేసే యూనిట్లపై పూర్తి స్థాయిలో ప్రణాళికను తయారుచేసి మొదటి విడుతలో రాష్ట్రంలోనే ఆదర్శం గా ఉండేలా పథకాన్ని అమలు చేయాలని ఆదేశించారు. సమావేశంలో మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావు, అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ యాదయ్య, డీఆర్డీవో యాదయ్య, సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ యాదయ్య, డీఏవో వెంకటేశ్, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి మధుసూదన్‌గౌడ్, అధికారులు, కౌన్సిలర్లు పాల్గొన్నారు.