Trisha | నా వ్యక్తిగత జీవితంలోకి తొంగి చూడొద్దు.. రూమర్లపై త్రిష పరోక్ష కౌంటర్!
Trisha | కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్,ప్రముఖ నటి త్రిష కృష్ణన్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉందంటూ వస్తున్న పుకార్లు అభిమానులు, నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ రూమర్ల తీవ్రత మరింత పెరిగింది. అయితే ఈ ప్రచారాలపై అటు విజయ్ గానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు ప్రత్యక్షంగా స్పందించింది లేదు.
Trisha | కోలీవుడ్ స్టార్ హీరో, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్,ప్రముఖ నటి త్రిష కృష్ణన్ గురించి గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక రకాల ప్రచారాలు జరుగుతున్నాయి. వీరిద్దరి మధ్య ప్రత్యేక బంధం ఉందంటూ వస్తున్న పుకార్లు అభిమానులు, నెటిజన్లలో పెద్ద చర్చకు దారితీశాయి. ముఖ్యంగా విజయ్ వ్యక్తిగత జీవితానికి సంబంధించిన వార్తలు వెలుగులోకి వచ్చిన తర్వాత ఈ రూమర్ల తీవ్రత మరింత పెరిగింది. అయితే ఈ ప్రచారాలపై అటు విజయ్ గానీ, ఇటు త్రిష గానీ ఇప్పటివరకు ప్రత్యక్షంగా స్పందించింది లేదు. కానీ తాజాగా త్రిష సోషల్ మీడియాలో చేసిన ఒక పోస్ట్ మాత్రం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. తన వ్యక్తిగత జీవితంపై జరుగుతున్న చర్చలకు పరోక్షంగా సమాధానం ఇచ్చినట్లుగా ఆమె పోస్టు ఉండటంతో నెటిజన్లు దానిపై ఆసక్తికరంగా స్పందిస్తున్నారు.
త్రిష తన ఇన్స్టాగ్రామ్ స్టోరీలో ప్రశాంతంగా నిద్రిస్తున్న తన పెంపుడు కుక్క ఫోటోను షేర్ చేసింది. ఆ ఫోటోకు జత చేసిన క్యాప్షన్ అందరి దృష్టిని ఆకర్షించింది. “నా విషయాల్లో ముక్కు పెట్టడానికి నేను అనుమతించే ఒకే ఒక్క ముక్కు ఇదే” అంటూ ఆమె రాసుకొచ్చింది. ఈ వ్యాఖ్యను చాలా మంది సోషల్ మీడియాలో తన గురించి వస్తున్న రూమర్లకు ఇచ్చిన కౌంటర్‌గా భావిస్తున్నారు. త్రిష ఎవరినీ నేరుగా ఉద్దేశించి మాట్లాడకపోయినా, తన వ్యక్తిగత జీవితంపై నిరంతరం చర్చలు చేసే వారికి ఇది గట్టి సందేశమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై అనవసర ఊహాగానాలు, సోషల్ మీడియా ట్రోలింగ్ పెరుగుతున్న నేపథ్యంలో త్రిష ఈ విధంగా స్పందించడం చర్చనీయాంశంగా మారింది.
ఇటీవల త్రిష చేసిన ప్రతి సోషల్ మీడియా పోస్ట్ అభిమానుల మధ్య వైరల్ అవుతుండగా, ఈ తాజా పోస్ట్ కూడా భారీగా షేర్ అవుతోంది. కొందరు ఆమె ధైర్యాన్ని ప్రశంసిస్తుంటే, మరికొందరు ఇది రూమర్లకు ఇచ్చిన సూటి సమాధానమని వ్యాఖ్యానిస్తున్నారు. మొత్తానికి, త్రిష తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న ప్రచారాలను పెద్దగా పట్టించుకోకుండా తనదైన శైలిలో స్పందించింది. ఈ పోస్ట్‌తో అయినా ఆమె గురించి జరుగుతున్న ఊహాగానాలు తగ్గుతాయా లేదా అన్నది చూడాల్సి ఉంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
WPL 2027 | ముంబై ఇండియన్స్ ట్రేడింగ్ డీల్.. మహిళా పేసర్‌కు రూ.10 లక్షలు..!
Pawan Kalyan | పవన్ కళ్యాణ్ సినీ ప్రయాణానికి 30 ఏళ్లు.. ఎమోషనల్ పోస్ట్‌తో శుభాకాంక్షలు తెలిపిన అల్లు అరవింద్!
Binod Chaudhary: నేపాలీ కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన ఆ దేశ ఏకైక బిలియనీర్
వరల్డ్ బ్యాంక్ బృందం నల్లగొండ క్లాక్ టవర్ జంక్షన్ అభివృద్ధి పనుల పరిశీలన
Mamitha Baiju | అతడి నిర్ణయమే ఫైనల్.. పెళ్లి పుకార్లకు ఫుల్స్టాప్ పెట్టిన మమితా బైజు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

