రేపటి నుంచి 1వ తేదీ వరకు కార్యక్రమం
జిల్లాలకు చేరిన పోలియో వ్యాక్సిన్లు
ఐదేండ్లలోపు చిన్నారులకు చుక్కల మందు
తొలి రోజు కేంద్రాల్లో,మిగిలిన రోజుల్లో ఇంటింటికీ వెళ్లి
పోలియో రహిత సమాజంగా మార్చేందుకు ప్రచారం చేపట్టిన వైద్య శాఖ
నాగర్కర్నూల్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ)/వనపర్తి :పల్స్ పోలియోకు వేళైంది. ఆదివారం చిన్నారులకు చుక్కల మందు వేసేందుకు వైద్యశాఖ సన్నద్ధమైంది. ఐదేండ్లలోపు చిన్నారులకు తొలి రోజు కేంద్రాల్లో.. మార్చి 1వ తేదీ వరకు ఇంటింటికీ వెళ్లి మందు వేయనున్నారు. ఇప్పటికే జిల్లాలకు వ్యాక్సిన్లు చేరాయి. పుట్టుకతో చిన్నారులకు అంగవైకల్యం రాకుండా ఉండేలా నిండు జీవితానికి రెండు చుక్కలు వేయించుకోవాలని అధికారులు విస్తృత ప్రచారం చేపట్టారు. వంద శాతం లక్ష్యంగా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. పోలియో రహిత సమాజం కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
చిన్నారులకు అంగవైకల్యం రాకుం డా ఉండేందుకు కేంద్ర ప్రభుత్వం పల్స్ పోలియో కార్యక్రమాన్ని చేపడుతున్నది. దేశంలో తొలిసారి గా 1972లో పోలియో చుక్కల మందు వేశారు. చుక్కల మందును కనిపెట్టిన జానస్ హాల్క్ పుట్టిన రోజు (అక్టోబర్ 24)ను పోలియో అవగాహన దినోత్సవంగా జరుపుకుంటాం. అపరిశుభ్రమైన ఆ హారం తీసుకోవడంవల్ల పోలియో వైరస్ శరీరంలోకి ప్రవేశిస్తుంది. రక్తంలో కలిసి నరాల్లోని జీవకణాలను బంధిస్తుంది. దీంతో కండరాలు బిగుసుకుపోయి క్రమంగా అవయవాలు చచ్చుబడిపోతా యి. ఇలా కేవలం వారం రోజుల్లోనే వ్యాధి తీవ్రతరమవుతుంది. మొదటి దశలో ఆహారం, నీళ్ల ద్వారా వైరస్ కడుపులోకి చేరుతుంది. రెండో దశ లో నరాల్లోకి.., మూడో దశలో కండరాలు, శ్వాసకోశం బలహీనపడి అవయవాలన్నీ చచ్చుబడుతా యి. ఈ వైరస్ ఒకటి, రెండేండ్ల చిన్నారులకే అధికంగా సోకుతుంది. దీనికి మందులు లేవు. కేవలం వ్యాక్సినేషనే పరిష్కారం. ఇంతటి ప్రమాదకరమైన వ్యాధిని నిర్మూలించేందుకు ప్రతి ఏడాది రెండు సార్లు పల్స్ పోలియో చుక్కల మందు వేస్తున్నారు. ప్రతి ఏడాది జనవరి, అక్టోబర్లో రెండు సార్లు వ్యాక్సిన్ వేస్తున్నారు.
గత జనవరిలో మందు వే యాల్సి ఉండగా కరోనా వల్ల వాయిదాపడింది. ఈ క్రమంలో ఈనెల 27వ తేదీన చుక్కల మందు వేయనున్నారు. బస్టాండ్లు, దవాఖానలు, జన సం చార ప్రాంతాల్లో ఆదివారం పోలియో కేంద్రాలు ఏర్పాటు చేసి మందు వేయనున్నారు. ఈ నెల 28, మార్చి 1వ తేదీన వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి ఐదేండ్లలోపు చిన్నారులకు మందు వేస్తారు. పల్స్ పోలియోపై వైద్యశాఖ విస్తృతంగా ప్రచారం చేపడుతున్నది. మీడియా, సోషల్ మీడియాతోపా టు టాంటాంల ద్వారా మందు ఆవశ్యకతపై అవగాహన కల్పిస్తున్నారు. కలెక్టర్ల ఆధ్వర్యంలో వైద్య, ఆరోగ్య శాఖల సమీక్ష పూర్తైంది. వంద శాతం మం దికి పోలియో చుక్కల మందు వేయాలని వైద్యశాఖకు ఆదేశాలు జారీ చేశారు.
నాగర్కర్నూల్ జిల్లాలో పల్స్ పోలియోకు వై ద్యారోగ్య శాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లాలో ఐదేండ్లలోపు చిన్నారులు 91,025 మంది ఉన్నా రు. వీరి కోసం 3,008 వ్యాక్సిన్లు జిల్లాకు చేరగా దవాఖానల్లో భద్రపరిచారు. 721 పోలింగ్ కేంద్రాలు, 28 బృందాలను ఏర్పాటు చేశారు. అలాగే ముఖ్య కూడళ్లు, బస్టాండ్లు వంటి 28 జన సంచార ప్రాంతాలను గుర్తించారు. పల్స్ పోలియోలో పా ల్గొనే సిబ్బందికి తాగునీరు, భోజన సదుపాయాలను కల్పించాలని మున్సిపల్, రెవెన్యూ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. తల్లిదండ్రులు తప్పనిసరిగా చుక్కల మందు వేయించాలి.
వనపర్తి జిల్లా వ్యాప్తంగా 400 కేంద్రాలు ఏర్పాటు చేశారు. అంగన్వాడీ, ఆశ కార్యకర్తలు, హెల్పర్లు, ఏఎన్ఎంలు మొత్తం 1,600 మంది సిబ్బంది విధులు నిర్వర్తించనున్నారు. హైరిస్క్ కేంద్రాలను గుర్తించి సూపర్వైజర్ల ఆధ్వర్యంలో ఇటుకబట్టీలు, పరిశ్రమల్లో ఉన్న చిన్నారులకు పోలియో చుక్కలు వేయనున్నారు.
జిల్లాలో 54,104 మంది చిన్నారులు ఉన్నారు. వలసలు వచ్చిన కుటుంబాల్లోని 455 మంది చిన్నారుల కోసం 135 కేంద్రాలు, బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, ప్రధాన చౌరస్తాలు కలిసి 13 కేంద్రాలు ఏర్పాటు చేశారు.