ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహించాలి : కలెక్టర్ క్రాంతి
ఆయిల్ పామ్ సాగుకు రైతులు ముందుకు రావాలని గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు కాంత్రి రైతులకు పిలుపునిచ్చారు.
గద్వాల జోగులాంబ : రైతులు ఆయిల్ పామ్ సాగు చేసేలా ప్రోత్సహించాలని కలెక్టర్ వల్లూరి క్రాంతి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో ఆయిల్ పామ్ సాగుపై ఉద్యానవనశాఖ, వ్యవసాయ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 2022 – 23 ఆర్థిక సంవత్సరానికి జిల్లాలో ఆయిల్ పామ్ విస్తీర్ణ పథకం కింద 4690 ఎకరాలు లక్ష్యంగా ఉండగా, 2367 ఎకరాలలో ఆయిల్ పామ్ సాగైందని. మిగిలిన 2323 ఎకరాలలో ఆయిల్ పామ్ పంటలు సాగు చేసేందుకు రైతులు ముందుకు వచ్చేలా వ్యవసాయ అధికారులు కృషి చేయాలనీ కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారికి 5 ఎకరాల వరకు లక్ష్యం ఉండగా.. జనవరి, ఫిబ్రవరి రెండు నెలల లక్ష్యాన్ని పూర్తి చేసేందుకు ఆయిల్ పామ్ సాగుపై రైతులకు అవగాహన కల్పించి, సాగుకు ముందుకు వచ్చేలా చూడాలని సూచించారు. ఆయిల్ పామ్ సాగుకు డ్రిప్ కోసం ఎకరాకు 4200 సబ్సిడీ జమ అవుతుందని తెలిపారు. డ్రిప్ ప్లాంటేషన్ కోసం డీడీలు కట్టించాలని.. అధికారులు సమన్వయంతో మిగిలిపోయిన లక్ష్యాలను పూర్తి చేయలనీ అదేశించారు. ఈ సమావేశంలో ఉద్యాన శాఖ అధికారి అక్బర్, వ్యవసాయ అధికారి గోవింద్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | ఆరేళ్ల పాప మిస్సింగ్ కేసు విషాదాంతం.. చంపేసి, సెల్లార్లో పడేసిన సెక్యూరిటీ గార్డు!
Dasturabad | బీఆర్ఎస్ హయాంలో మండలం.. పదేళ్లలో మారిన ‘దస్తురాబాద్’ రూపురేఖలు..!
Bhatti Vikramarka | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. సర్పంచ్ ఫాతిమాభి రాజీనామా!
Kachavaram | డిప్యూటీ సీఎం ఇలాకాలో కాంగ్రెస్‌కు షాక్.. అభివృద్ధిపై అసంతృప్తితో సర్పంచ్ రాజీనామా..!
కొలనూరులో వీధి కుక్కల స్వైరవిహారం.. దూడ మృతి
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

