
నారాయణపేట టౌన్, ఆగస్టు 17 : హైరిస్క్ ఉన్న గర్భిణులను ముందుగానే గుర్తించి తగిన చర్యలు తీ సుకొని మాతృ, నవజాత శిశు మరణాలను నివారించాలని డీఎంహెచ్వో డాక్టర్ రామ్మనోహర్రావు స్ప ష్టం చేశారు. మంగళవారం పట్టణంలోని డీఎంహెచ్ వో కార్యాలయంలో జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేం ద్రాలు, పీపీ యూనిట్, సామాజిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులకు హైరిస్క్ లక్షణాలు గల ‘గర్భాధారణ-సమగ్ర నిర్వహణ నియమాలు’ అంశంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హైరిస్క్ లక్షణాలు రక్తహీనత, అధిక రక్తపోటు, మధుమేహం, థైరాయిడ్ తదితర దీ ర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు, 18 ఏండ్ల కన్న ముం దు, 35 ఏండ్ల తర్వాత గర్భం దాల్చిన వారు, 5 అడుగుల కన్నా తక్కువ ఎత్తు ఉన్నవారు గర్భం దాల్చినట్లయితే కాన్పు సమయంలో సమస్య లు తలెత్తి, తల్లీబిడ్డల ఆరో గ్యం, వారి ప్రాణాలకు ము ప్పు వాటిల్లే ప్రమాదం ఉం టుం దన్నారు.
గర్భం దాల్చి న మహిళకు సంబంధించి పూర్తి వివరాలను నమోదు చే సుకోవాలని, ప్రతి గర్భిణీ కనీ సం 4 సార్లు పీహెచ్సీ వైద్యాధికారిచే పరీక్షలు చేయాలని సూచించారు. ఏఎన్ఎంలు, వైద్యాధికారులు, ఇతర సిబ్బంది సమన్వయంతో పనిచేస్తూ మాత శిశువులకు ఆరోగ్య సేవలను అందించాలని, సుఖ ప్రసవం నిర్వ హించడంతో తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉండేలా కృషి చేయాలని కోరారు. శిక్షణలో జిల్లా ఉపవైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ శైలజ, మాస్టర్ ట్రైనర్లు అశ్విని, శ్రవంతి, కిష్టమ్మ, ప్రోగ్రాం అధికారి రవీందర్ లఖావత్, ఎన్సీడీ పీవో సిద్ధప్ప, మాస్ మీడియా అధికారి హన్మంతు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.