Rizwan Basha Shaik | సీఎంఆర్ బియ్యం అప్పగించాల్సిందే.. మిల్లర్లకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరిక
Rizwan Basha Shaik | మంగళవారం సాయంత్రం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ పెండింగ్ సీఎంఆర్ అంశాన్ని సమీక్షించారు.
Rizwan Basha Shaik | గద్వాల: ప్రభుత్వానికి అప్పగించాల్సిన కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) బియ్యాన్ని సకాలంలో డెలివరీ చేయాల్సిందేనని జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ రైస్ మిల్లర్లను ఆదేశించారు. ఏళ్ల తరబడి సీఎంఆర్ బకాయిలను పెండింగ్‌లో ఉంచడం, నిబంధనలను ఉల్లంఘించడం సహించబోమని స్పష్టం చేశారు. ప్రభుత్వ బియ్యం అప్పగించకుండా నిర్లక్ష్యం వహించే మిల్లర్లపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో పౌరసరఫరాల శాఖ అధికారులు, రైస్ మిల్లర్లతో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ పెండింగ్ సీఎంఆర్ అంశాన్ని సమీక్షించారు. ఇటీవల విజిలెన్స్ అధికారులు జిల్లాలోని కొన్ని మిల్లుల్లో తనిఖీలు నిర్వహించగా, నిబంధనల ఉల్లంఘనల నేపథ్యంలో ఒక మిల్లును సీజ్ చేసినట్లు తెలిపారు. ప్రభుత్వానికి ధాన్యం, బియ్యం అప్పగించాల్సిన విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిపై చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
20 రోజుల్లో సీఎంఆర్ డెలివరీ పూర్తి చేయాలి..
గత ఖరీఫ్, రబీ సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ బియ్యాన్ని 20 రోజుల్లోగా ప్రభుత్వానికి అప్పగించాలని కలెక్టర్ ఆదేశించారు. కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న సీఎంఆర్ వివరాలను మిల్లు వారీగా సమగ్రంగా సేకరించి 15 రోజుల్లోగా తనకు నివేదిక అందించాలని పౌరసరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. వేలం వేసిన ధాన్యానికి సంబంధించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాలను కూడా నిబంధనల ప్రకారం చెల్లించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.
డిఫాల్టర్లకు నోటీసులు.. బకాయిలు చెల్లించకపోతే కేసులు..
భారీ మొత్తంలో సీఎంఆర్ బకాయిలు పేరుకుపోయిన మిల్లర్లకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని అధికారులకు సూచించారు. గతంలో జరిమానాలు విధించినప్పటికీ బకాయిలు చెల్లించని డిఫాల్టర్లపై తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అవసరమైతే కేసులు నమోదు చేస్తామని స్పష్టం చేశారు. సీఎంఆర్ డెలివరీని పక్కనపెట్టి ప్రైవేటు ధాన్యాన్ని మిల్లింగ్ చేసే వారిపైనా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
బ్యాంకు గ్యారంటీ ఇస్తేనే ధాన్యం కేటాయింపు..
2026–27 ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి బ్యాంకు గ్యారంటీ సమర్పించే మిల్లులకే ధాన్యం కేటాయింపులు ఉంటాయని కలెక్టర్ స్పష్టం చేశారు. మిల్లర్లు నవంబర్ 15లోగా బ్యాంకు గ్యారంటీలు అందజేయాలని ఆదేశించారు. ఎల్‌నినో పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వానికి అవసరమైన బియ్యం నిల్వలను పూర్తిస్థాయిలో సమకూర్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
తెల్ల రేషన్ కార్డుదారులకు వచ్చే ఏడాది వరకు ప్రతి నెలా బియ్యం పంపిణీ చేయడంతో పాటు, వసతి గృహాలు, విద్యాసంస్థలు, ఇతర ప్రభుత్వ అవసరాలకు కూడా బియ్యం అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పౌరసరఫరాల శాఖ మేనేజర్ విమల, ఎన్ఫోర్స్మెంట్ డీటీలు ప్రశాంత్, రాజేష్, ఇతర అధికారులు, రైస్ మిల్లర్లు పాల్గొన్నారు.
Read Also :
Sigma | ఓటీటీలోకి విజయ్ కొడుకు తొలి సినిమా.. సందీప్ కిషన్ ‘సిగ్మా’ స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
India-A Vs New Zealand-A: డ్రాగా ముగిసిన ఇండియా-ఏ, న్యూజిలాండ్-ఏ మ్యాచ్
Karimnagar | ఎల్నీనో ఎఫెక్ట్.. ఎండుతున్న పంటలు.. కరువు కోరల్లో కరీంనగర్
Read Today's Latest Mahabubnagar Mahabubnagar News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Rizwan Basha Shaik | సీఎంఆర్ బియ్యం అప్పగించాల్సిందే.. మిల్లర్లకు కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ హెచ్చరిక
సుందరయ్యనగర్‌లో పోలీసుల కార్డెన్ సెర్చ్
పనకబండలో ఇంటింటికి ఫామ్-18 స్లిప్పుల పంపిణీ
Cyclone Arnab | తీరాన్ని తాకకముందే ఉత్తరాంధ్ర జిల్లాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న అర్నాబ్ తుపాను..!
‘నవంబర్ 13 నుండి 16 వరకు నల్లగొండలో అగ్రి షో’
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

