Jogulamba Gadwal | ధరూర్ : కోతుల గిద్ద స్టేజి సమీపంలోని వరి పొలంలో పడి వ్యక్తి మృతి చెందినట్లు ఎస్సై కొండ శ్రీహరి తెలిపారు. ఆయన కథనం కథనం ప్రకారం వివరాలిలా
ఉన్నాయి.. మండలంలోని కోతుల గిద్ద స్టేజి సమీపంలో వరి పొలాల్లో పడి ఓ వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు ఎస్ఐకి సమాచారం అందించారు. విషయం
తెలుసుకున్న ఎస్ఐ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించగా, ఓ వ్యక్తి పొలాల్లో పడి చనిపోయి ఉన్నాడు.
మృతి చెందిన వ్యక్తి ఆనవాళ్లను పరిశీలించగా గద్వాల కుచెందిన వ్యక్తిగా గుర్తించారు. అయితే వ్యక్తి తెల్లవారుజామున మృతి చెంది ఉండవచ్చునని, సమీపంలో మద్యం బాటిల్ కనిపించడంతో, రాత్రి మద్యం బాగా సేవించి మూత్రవిసర్జనకై రోడ్డు పక్కకు వెళ్లిన వ్యక్తి, మద్యం మత్తులో జోగుతూ సమతుల్యం కోల్పోయి పంట పొలాలలో మూతి కొట్టుకొని పడడంతో ఊపిరాడక మృతి చెంది
ఉండవచ్చునని అనుమానం వ్యక్తం చేశారు. మిగతా విషయాలు విచారణ తర్వాత తెలియజేస్తామని ఆయన అన్నారు.