గద్వాల: గద్వాల జిల్లా కేటిదొడ్డి మండలం నందిన్నె గ్రామ మాజీ సర్పంచ్ చిన్న భీమరాయుడు హత్య కేసులో ప్రధాన నిందితులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్పీ టి.శ్రీనివాస్ రావు గురువారం జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. నిందితుల నుంచి 8,50,000 రూపాయలు, 4కార్లు, 1-బొలేరో, 2బైక్ లు, 11 మొబైల్ స్వాధీనం చేసుకున్నారు.
రిమాండ్కు తరలించిన వారిలో మిల్లు వీరన్న, కుర్వ సురేందర్, బోయ వీరన్న, తెలుగు మధు బాబు, తెలుగు కృష్ణ, సంజీవులు, బైరీ సుంకన్న, బైరీ కేశన్న, ప్రభుస్వామి, హరిజన్ రాజేశ్ ఉండగా, కర్నూల్ జిల్లాకు చెందిన ఈశ్వర్వయ్య గౌడ్ పరారీలో ఉన్నాడని తెలిపారు.