నారాయణపేట టౌన్, మే 21 : సొంత ఊరిలోనే ఉపా ధి కల్పించడంతో వలసలు నివారించాలని ప్రభుత్వం జాతీ య గ్రామీణ ఉపాధి హామీ పథకం అమలు చేస్తున్నది. పథకంలో వేలాది మంది కుటుంబాలు పని చేస్తూ ఉపాధి పొం దుతున్నాయి. జిల్లాలో అన్ని గ్రామాల్లో ఉపాధి హామీ పను లు కొనసాగుతున్నాయి. కోరిన ప్రతి ఒక్కరికీ పని కల్పించేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకొని కూలీలకు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నారు. గతేడాది వరకు ఉపాధి పనులు చేసే వారికి దినసరి కూలీగా రూ.245 చెల్లించేవారు. కానీ ఈసారి రూ.12 కూలీ పెంచి రూ.257 ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించిం ది. అయితే ఏప్రిల్, మే నెలలో గమనిస్తే గరిష్ఠంగా దినసరి కూలీ రూ.177 మాత్రమే అందుకున్నారు. కూలీలు ఎక్కు వ గంటలు పని చేయడం, గ్రూపులుగా ఉండి కొలతలు వే సుకొని పనులు చేయడంతో ఎక్కువ వేతనం పొందవచ్చని అధికారులు చెబుతున్నారు. ఉపాధి హామీ పనులను కూలీ లు సద్వినియోగం చేసుకుంటున్నారు.
ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం జిల్లాలో దాదాపు 200 రకాల పనులు చేయాల్సి ఉంది. అయితే ప్రస్తుత వేసవిలో పాటు కాలువల పూడికతీత, చెరువుల పూడికతీత, ఫాంపాండ్ల నిర్మాణం, కందకాలు, పొలాలకు మట్టి రోడ్ల ఏర్పాటు తదితర పనులను చేపడుతున్నారు. అయితే కూలీ లు పూడికతీత పనుల్లో ఎక్కువ కూలీ పొందినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
జిల్లాలో మొత్తం 280 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 32,447 జాబ్ కార్డులు కలి గి ఉన్న కుటుంబాలు ఉండగా, ఇప్పటి వర కు 51,643 మంది కూలీలకు పనులు క ల్పించారు. ప్రతిరోజూ 27,969 మంది కూ లీలు పనులకు హాజరవుతున్నారు. అయితే ప్రతిరోజూ ఒక్కో గ్రామంలో 200 మంది కూలీలతో పని చేయించాలని లక్ష్యంగా పెట్టుకోగా, సరాసరి 100 మంది కూలీలు హాజరవుతున్నారు. ఏప్రిల్ నెలలో నర్వ మండలం లో గరిష్ఠంగా రూ.154 కూలీ అందుకోగా, కోస్గి మండలంలో కనిష్ఠంగా రూ.122 అం దుకున్నారు. జిల్లాలో సరాసరి రూ.134 దినసరి కూలీ పొందారు. అదేవిధంగా మే నెలలో గరిష్ఠంగా కృష్ణ మండలంలో రూ.17 7 అందుకోగా, దామరగిద్ద మండలంలో రూ.116 అందుకున్నారు. 2022-23 ఆర్థి క సంవత్సరంలో జిల్లాలో 30,52,923 పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. ఏప్రిల్ నెలలో 4,44, 736 పనిదినాలు కల్పించారు. మే నెలలో 9,59,065 పనిదినాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకోగా ఇప్పటి వరకు 6,27,191 పనిదినాలు కల్పించారు. మద్దూర్ మండలం లో అత్యధికంగా 1,12,083 పనిదినాలు కల్పించగా, అత్యల్పంగా కృష్ణ మండలంలో 12,303 పనిదినాలు కల్పించారు.
ఉపాధి ఫాంపాండ్‌లో చేపడుతున్న పనులు నా ణ్యతతో చేపట్టాలి. పథకంలో రై తులకు మేలు చేకూర్చే పనులకు ప్రాధాన్యత ఇవ్వాలి. వర్షపు నీటి ని నిల్వ చేసే పనులు చేయడంతో భూగర్భ జలాలు కాపాడుకోవచ్చు. అంతే కాకుండా నేల లు సారవంతంగా మారి పంట దిగుబడి ఎక్కువగా వ స్తున్నది. అడిగిన ప్రతి ఒక్కరికీ పని కల్పించేలా చ ర్యలు తీసుకుంటున్నాము.
-గోపాల్‌నాయక్, డీఆర్డీవో
సద్వినియోగం చేసుకోవాలి
ఉపాధి హామీ పథకం నిరంతరాయంగా కొనసాగుతున్నది. కూలీలు పథకంతో ప నులు చేసి ఆర్థికంగా నిలదొక్కుకోవాలి. జాబ్‌కార్డు కలిగిన ప్రతిఒక్కరూ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి. సొంత ఊరిలోనే ఉపాధి పొందాలనుకునే వారికి ఇది మంచి పథకం.
-వనజాగౌడ్, జెడ్పీ చైర్పర్సన్