మహబూబ్‌నగర్‌టౌన్, మే 8: మండలంలోని పార్పల్లి ప్రాతమిక పాఠశాలలో మాతృదినోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలోని యువకులు వీరయ్య, శ్రీశైలం, నాగరాజు, ఉమర్ చిన్నారులతో వేసిన మాతృదినోత్సవ ఆకృతి అందరినీ ఆకట్టుకున్నది.
రెమా చర్చిలో
జిల్లా కేంద్రంలోని హౌసింగ్ బోర్డు సమీపంలోగల రెమా వర్షిప్ సెంటర్లో ఆదివారం ప్రపంచ మదర్స్‌డే వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా పాస్టర్ బీఎస్.పరంజ్యోతి, సిస్టర్ రత్నమ్మ మాట్లాడుతూ మానవాళి అంతా దేవుడు చేసిన సృష్టి అయినా చాలామంది దేవుడికి దూరంగా వెళ్లినా ఆయన క్షమించి తన అక్కున చేర్చుకొనే గొప్ప దేవుడన్నారు. లోకంలో ఉన్న తల్లి తన బాధ్యతల్ని గుర్తించి కుటుంబానికి సమాజానికి ఆదర్శంగా రాణించాలన్నారు. అనంతరం తల్లులను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో తల్లు లు ప్రైజీరాణి, బ్లాండినా, మేరి, మణిమ్మ, మార్త, మకెమా, బ్లెస్సీ, సంఘపెద్దలు పాల్గొన్నారు.
వృద్ధ్దాశ్రమంలో పండ్లు పంపిణీ
మహబూబ్‌నగర్ రూరల్, మే 8: మహబూబ్‌నగర్ మన్యకొండ శివారులో పోగ్రెస్సివ్ పీపుల్ ఫ్రంట్ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మాతృదినోత్సవం సందర్భంగా రామకృష్ణ వృద్ధ్దాశ్రమంలో వృద్ద అనాథ తల్లిదండ్రుల మధ్య కార్యక్రమం నిర్వహించారు. సంస్థ అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ సొంత పిల్లలకు దూరంగా వృద్ధాశ్రమంలో కాలం వెళ్లదీస్తున్న తల్లితండ్రుల మధ్య కార్యక్రమం నిర్వహించడం ఆనందంగా ఉందన్నారు.
బంధా లు బంధుత్వాలు యొక్క విలువలను వాళ్ళు కోల్పోయినా దూరమైన విలువలను, ప్రేమను వాళ్లకు అందించాలనే ఉద్దేశంతో మదర్స్‌డే కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అనంతరం వృద్ధ్ద తల్లుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో సంస్థ ఉపాధ్యక్షుడు రవికిరణ్, కార్యదర్శులు రాములమ్మ, గోపాలకృష్ణ, రామలింగం, కార్యవర్గసభ్యులు సతీశ్‌కుమార్,అశోక్‌కుమార్, కవిత, వృద్ధాశ్రమం సభ్యులు నారాయణ, రామాచారి, చెన్నయ్య, సాయిలు, చంద్రయ్య, భాగ్యమ్మ, రామచంద్రమ్మ తదితరులు పాల్గొన్నారు.