
భూత్పూర్, ఆగస్టు 17: గ్రామాల్లో అమలుచేస్తున్న ఉపాధిహామీ పథకాన్ని సర్పంచులు, అధికారులు సద్వినియోగ చేసుకోవాలని డీఆర్డీవో యాదయ్య కోరారు. మండలంలోని కర్వెన రైతువేదికలో మంగళవారం పంచాయతీరాజ్ ఆధ్వర్యంలో ఎంపీపీ కదిరె శేఖర్‌రెడ్డి అధ్యక్షతన ఈజీఎస్ పథకంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఉపాధిహామీ సిబ్బంది గ్రామాల్లో పథకంపై అవగాహన కల్పించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే కూలీలకు ఉపాధి కల్పించడంతోపాటు నిధుల కొరత ఉండదని తెలిపారు. వ్యవసాయరంగం పనులు, ఉద్యానవన శాఖ పనులను, పొలాల్లో పంట కాల్వలు, పాటు కాల్వలు నిర్మించాలన్నా, కొత్తగా రోడ్డు వేయాలన్నా ఈ పథకం ద్వారా వేసుకోవచ్చని తెలిపారు. ప్రభుత్వం రైతులకు ఇచ్చే రాయితీని ఇస్తూ పనులు చేసుకోవచ్చన్నారు.
ముఖ్యంగా చెక్‌డ్యాంల నిర్మాణాలకు, చెరువుల్లో పూడికతీతకు ఎక్కువగా వినియోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీఈ నరేశ్, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, రైతుబంధు మండల కోఆర్డినేటర్ నర్సింహగౌడ్, ఏడీఏ యశ్వంత్‌రావు, ఏపీడీ జకియాసుల్తానా, హార్టికల్చర్ ఈడీ సాయిబాబా, ఎంపీడీవో మున్ని, ఏవో మురళీధర్, ఎంపీవో విజయ్‌కుమార్, ఏపీవో విమల, నాయకులు మాధవరెడ్డి, నర్సింహారెడ్డి, ప్రతాప్, బాలేమి య్య, సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.