గద్వాల టౌన్, ఆగస్టు 11 : జ్ఞాన సంపదగా.. విజ్ఞాన కేంద్రాలుగా.. భవితకు బంగారు బాట వేసే నిధిగా గ్రంథాలయాలను కొనియాడుతా రు. సంస్కారవంతులుగా తీర్చిదిద్దడంలో వాటి పాత్ర ఎంతో ఉం టుంది. అలాంటి గ్రంథాలయ శాస్ర్తానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన రంగనాథన్ జయంతి సందర్భంగా ప్రతి ఏడాది ఆగస్టు 12న జాతీయ గ్రంథాలయ దినోత్సవాన్ని జరుపుకోవడం ఆనవాయితీ. గ్రం థాలయాలు.. జ్ఞాన బాంఢాగారాలుగా చెప్పుకోవచ్చు. ఈ నాటివి చెందినవి కావని, పురాణ కాలం నుంచి గ్రంథాలయాలు ఉన్నాయని పెద్దలు చెబుతున్నారు. రామాయణం, మహాభారతం, వేదాలు ఇలా ఎన్నో విషయలను ఋషులు, మహానుభావులు తాటి పత్రాలపై నిర్లిప్తం చేశారు. అందుకే నేడు ఆ మహా గ్రంథాల గురించి మన సంస్కృతిని, సంప్రదాయన్ని, హైందవ ధర్మాలను అనుసరించగులుగుతున్నాం. మనిషితో పు స్తకానికి విడదీయ రాని బంధం ఉంటుంది. సాంకేతికత రోజు రోజుకూ కొత్తపుంతలు తొక్కుతున్నా.. పుస్తకాలకు ఇంకా ఆదరణ తగ్గడం లేదు. మనకు తెలియని ఎన్నో విషయాలను పుస్తక పఠనం ద్వారా తెలుసుకోవచ్చు. వేల ఏండ్ల కిందటి చరిత్రను కూడా తెలియజేస్తుంది. అలాంటి పుస్తకాలను గ్రంథాలయం మనకు అందిస్తుంది.
మన జాతీయ గ్రంథాలయం..
మన జాతీయ గ్రంథాలయం సాంస్కృతిక శాఖ పరిధిలో కోల్కత్తాలో ఉన్నది. 1836లో రవీంద్రనాథ్ఠాగూర్ వంటి మహానుభావుల ఆధ్వర్యంలో గ్రంథాలయం ప్రారంభమైంది. దేశంలో అన్ని భాషల పుస్తకాలు ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రతి భాషా విభాగాలు ప్రత్యేకంగా ఉంటాయి. 1963లో తెలుగుకు ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. భారత ముద్రణా వారసత్వ సంపదను భవిష్యత్ తరాలకు అందించాలన్న లక్ష్యంతో గ్రంథాలయాన్ని స్థాపించారు.
నేపథ్యం..
డాక్టర్ ఎస్.ఆర్. రంగనాథన్ 1892 ఆగస్టు 12వ తేదీన చెన్నైలోని తంజావూర్లో జన్మించారు. గ్రంథాలయాల అభివృద్ధి కోసం అహర్నిశ లు కృషి చేశారు. గ్రంథాలయోధ్యమంలో కీలక పాత్ర పోషించారు. లైబ్రే రియన్గా ఎన్నో ఏండ్లు సేవలు చేశారు. గ్రంథాలయ సంఘం జాతీయ అధ్యక్షుడిగా, యూజేసీ లైబ్రేరియన్ కమిటీ అధ్యక్షుడిగా విశేష సేవలందించారు. 1930 గ్రంథాలయ నమూనా చట్టాన్ని రూపొందించి దేశ వ్యాప్తంగా అమలయ్యేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. 1924లో క్లాసిఫికేషన్, 1934లో కేవలాగింగ్ కోడ్లను రూపొందించారు. తద్వారా పాఠకులకు పుస్తకాలు సులభంగా లభించేవి. పుస్తక ప్రియులకు అనుగుణం గా పంచ సూత్రాలను ఆచరలో పెట్టారు. అంతేకాక ఆయన స్వయంగా 60 గ్రంథాలను, 200కు పైగా కథలను రాశాడు. ఇందుకు గానూ ఆయనకు 1935లో దాదా సాహెబ్పాల్కే అవార్డు లభించింది. 80 ఏండ్ల పాటు సేవలందించిన రంగనాథన్ 1972 సెప్టెంబర్ 27న తుదిశ్వాస విడిచారు. ఆయన తన తుది శ్వాస వరకు గ్రంథాలయాల అభివృద్ధికి విశేష సేవలందించారు. ఆగస్టు 12న ఆయన జయంతిని పురస్కరించుకొని జాతీయ గ్రంథాలయ దినోత్సవం జరుపుకొంటున్నాం.
జోగుళాంబ గద్వాల జిల్లాలో..
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంతోపాటు తొమ్మిది మండలాల్లో గ్రంథాలయ నిర్వహణ కొనసాగుతున్నది. ఆరు మండలాల్లో సొంత భవనాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని గ్రంథాలయంతోపాటు మిగతా మూడు మండలాల్లో ఇతర శాఖల భవనాల్లో కొనసాగుతున్నాయి. కా గా, అయిజలో నిర్మించిన నూతనం భవనం ఈ నెల 14న ప్రారంభం కానున్నది. జిల్లా కేంద్రంలో భవన నిర్మాణానికి రూ.1.60 కోట్లు మం జూరయ్యాయి. మిగతా గ్రంథాలయాల ఏర్పాటుకు అధికారులు చర్య లు తీసుకుంటున్నారు.