మహబూబ్‌నగర్ మార్చి 28 : రా ష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. సోమవారం జెడ్పీ సమావేశమందిరంలో చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి అధ్యక్షతన సర్వసభ్య నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు సభ్యు లు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ద్వం ద్వవైఖరి వీడి ధాన్యం కొనుగోలుకు చర్య లు తీసుకోవాలన్నారు. అలాగే వ్యవసాయానికి విద్యుత్ అంతరాయం ఏర్పడకుండా చూడాలన్నారు. మనఊరు-మన బడి కార్యక్రమంలో పాఠశాల భవనాలను ఇతర ప్రాంతంలో నిర్మించేందుకు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే పాఠశాలల్లో వాచ్మెన్లను ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమంలో వైస్‌చైర్మన్ యాద య్య, సీఈవో జ్యోతి ఉన్నారు.
రైతులపై వివక్ష తగదు
తెలంగాణ రై తులపై కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపడం తగదని రైతుబంధు సమితి మండల కన్వీనర్ రాజుయాదవ్ అన్నారు. యాసంగి వడ్లను కేంద్రమే కొనుగోలు చేయాలని సోమవారం మండలకేంద్రంలో రైతుబం ధు సమితి ఆధ్వర్యంలో తీర్మానం చేశారు. రైతులకు అన్యాయం చేయాలని చూస్తే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. కా ర్యక్రమంలో సుదర్శన్, సాయిలు, ఆనం ద్, కృష్ణార్జున్, పాపయ్య, రాములు, సు క్కయ్య, బసిరెడ్డి పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ మండలంలో..
యాసంగి వడ్లను కేంద్ర ప్రభుత్వమే కొ నుగోలు చేయాలని మహబూబ్‌నగర్ మండల పరిషత్‌లో తీర్మానం చేశారు. కా ర్యక్రమంలో ఎంపీపీ సుధాశ్రీ, వైస్‌ఎంపీపీ అనిత, ఎంపీటీసీలు పాల్గొన్నారు.