జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్
కొత్తకోట, మార్చి 12: సీఎం కేసీఆర్ దేశానికే దిక్సూచి అని జెడ్పీ వైస్‌చైర్మన్ వామన్‌గౌడ్ అన్నారు. శనివారం పట్టణంలోని మున్సిపాలిటీలో ఏర్పాటు చేసిన సమావేశానికి ఆయన హాజరై మాట్లాడారు. అంతకుముందు జిల్లాలోని మున్సిపాలిటీలు, పంచాయతీలకు నిధులు కేటాయించినందున సీఎం కేసీఆర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ సుకేశిని ఆధ్వర్యంలో క్షీరాభిషేకం చేశారు. రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచిన నాయకుడు కేసీఆర్ అన్నారు. అలాంటి సీఎం తెలంగాణకు ఉండటం అదృష్టమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్పర్సన్ జయమ్మ, మాజీ జెడ్పీటీసీ విశ్వేశ్వర్, ఉమ్మడి జిల్లాల అధికార ప్రతినిధి ప్రశాంత్, కౌన్సిలర్ పద్మ అయ్యన్న, తిరుపతయ్య, ఖాజామైనుద్దీన్, రాములుయాదవ్, కోఆప్షన్ సభ్యులు వసీంఖాన్, వహీద్, నాయకులు శ్రీనుజీ, శాంతిరాజ్, వెంకటేశ్, హనుమంతుయాదవ్, వినోద్‌సాగర్, మహేశ్, పద్మానెహ్రూ, కిరణ్ పాల్గొన్నారు.
అమరచింత మున్సిపాలిటీలో..
అమరచింత, మార్చి 12: అమరచింత మున్సిపాలిటీకి రూ.50లక్షల నిధులు విడుదల చేస్తూ జీవో జారీ చేయడంపై మున్సిపల్ చైర్పర్సన్ మంగమ్మ హర్షం వ్యక్తం చేశారు. శనివారం మున్సిపాలిటీలో ఆమె మాట్లాడుతూ వనపర్తి పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ మున్సిపాలిటీలకు, గ్రామ పంచాయతీలకు నిధులు కేటాయిస్తానని హామీ ఇచ్చారని, ఇచ్చినమాట నిలబెట్టుకున్నారని తెలిపారు. ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి సహకారంతో మున్సిపాలిటీలో వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతామని మున్సిపల్ చైర్పర్సన్ హర్షం వ్యక్తం చేశారు.
పెబ్బేరు మున్సిపాలిటీలో..
పెబ్బేరు, మార్చి 12: జిల్లాలో సీఎం కేసీఆర్ పర్యటనలో భాగంగా మంత్రి నిరంజన్‌రెడ్డి అభ్యర్థన మేరకు జిల్లాలోని 255 గ్రామపంచాయతీలకు రూ.20లక్షలు, నాలుగు ము న్సిపాలిటీలకు రూ.50లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ సందర్భంగా పట్టణంలోని సుభాష్ చంద్రబోస్ చౌరస్తాలో శనివారం టీఆర్ఎస్ మండలాధ్యక్షుడు వనం రాములుయాదవ్ ఆధ్వర్యంలో ఎంపీపీ శైలజ, ఆయా గ్రామాల సర్పంచులతో కలిసి క్షీరాభిషేకం చేశారు. మండల, పట్టణ ప్రజల తరుఫున సీఎం కేసీఆర్, మంత్రి నిరంజన్‌రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు గోవిందునాయుడు, వెంకటేశ్, రవీందర్, రాజవర్ధన్‌రెడ్డి, గట్టయ్య, నాయకులు కురుమూర్తి, సాయినాథ్, వెంకటేశ్, ఎల్లయ్య, మహేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.