అర్థంపర్థం లేని ప్రతిపక్షాల విమర్శలు
విలేకరుల సమావేశంలో ఎంపీ రాములు
అచ్చంపేట టౌన్, మార్చి 12 : అభివృద్ధిలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని ఎంపీ రాములు తెలిపారు. శనివారం పట్టణంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తన రాజకీయ ఆరంగేట్రం పబ్లిక్ క్లబ్ నుంచి మొదలైందని తెలిపారు. క్లబ్ అభివృద్ధి దశలో పరుగెడుతున్నదని చెప్పారు. కొత్త గా షటిల్ కోర్టు ఏర్పాటు చేశారన్నారు. నూతన భవనంపై జిమ్ ఏర్పాటు చేయాలని, కావాల్సిన సామగ్రి సమకూర్చాలని సూచించారు. ఎంపీ నిధులు క్లబ్ స భ్యులకు అందిస్తానని హామీ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ఆ రోగ్య పరిస్థితి నిలకడగా ఉన్నదని తెలిపారు. రాష్ట్రంలో ని అభివృద్ధిని చూసి ఓర్వలేని బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నాయకులు విమర్శలు చేస్తున్నారని చెప్పారు. పంటల ఉత్పత్తిలో ఆదర్శంగా నిలిచిందన్నారు. విద్యా వ్యవస్థలో ప్రైవేటుకు దీటుగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తెలుగు, ఆంగ్ల బోధన కొనసాగుతున్నదని పేర్కొన్నారు. సమావేశంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పోకల మనోహర్, జెడ్పీటీసీలు భరత్‌ప్రసాద్, మంత్రియా నాయక్, మాజీ ఎంపీపీ పర్వతాలు, క్లబ్ అధ్యక్షుడు సతీష్, ప్రధాన కార్యదర్శి అంగిరేకుల గోపా ల్, కోశాధికారి గాదె చంద్రశేఖర్, క్లబ్ ఎగ్జిక్యూటీవ్ స భ్యులు మేడిశెట్టి రమేశ్, సభ్యులు, టీఆర్ఎస్ నాయకు లు అమీనొద్దీన్, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు.