నవాబ్‌పేట, మార్చి 12 : మండలంలోని కాకర్జాల టీఆర్ఎస్వీ గ్రామ కమిటీని నియోజకవర్గ ప్రధానకార్యదర్శి ఫయాజ్, యూత్ మండల అధ్యక్షుడు మెండె శ్రీను ఆధ్వర్యంలో శనివారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కాకర్జాల అధ్యక్షుడిగా శంకర్, ప్రధానకార్యదర్శిగా ప్రసాద్‌గౌడ్, ఉపాధ్యక్షులుగా లాలూనాయక్, రాజశేఖర్ తదితరులను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమం లో సర్పంచులు పద్మాశ్రీనివాస్నాయక్, అలివేలుపరశురాం, మాజీ ఎంపీపీ శీనయ్య, అబ్దుల్‌అలీ, ప్రకాశ్ తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, మార్చి 12 : మండలంలోని బోడజానంపేట, అప్పాజీపల్లి, పల్గుమీదిగడ్డతండాల్లో శనివారం టీఆర్ఎస్వీ గ్రామ కమిటీలను ఏర్పాటు చేసినట్లు యూత్వింగ్ మండల అధ్యక్షుడు సుప్ప ప్రకాశ్ తెలిపారు. బోడజానంపేట గ్రామాధ్యక్షుడిగా అజయ్‌ప్రసాద్, ఉపాధ్యక్షుడిగా శ్రీకాంత్, కార్యదర్శిగా కళ్యాణ్‌తోపాటు కార్యవర్గసభ్యులను ఎన్నుకున్నట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఏఎంసీ డైరెక్టర్లు మల్లేశ్, జగదీశ్వర్‌రెడ్డి, యూత్వింగ్ ప్రధానకార్యదర్శి రవినాయక్, బాలయ్య, కృష్ణ, శేఖర్, రవి పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, మార్చి 12 : మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్వీ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు యూత్ మండల అధ్యక్షుడు వెంకటేశ్ తెలిపారు. చొక్కంపేట గ్రామాధ్యక్షుడిగా సిద్దూగౌడ్, ప్రధానకార్యదర్శిగా సుదర్శన్, కొర్రతండా అధ్యక్షుడిగా కేతావత్ కోటి, ప్రధానకార్యదర్శిగా కుమార్, చెన్నవెల్లి గ్రామాధ్యక్షుడిగా పరశురాం, ప్రధానకార్యదర్శిగా శివకుమార్, ఖానాపూర్ గ్రామాధ్యక్షుడిగా శంకర్, ప్రధానకార్యదర్శిగా సోమయ్య, రాఘవాపూర్ గ్రామాధ్యక్షుడిగా గుళ్ల నరేశ్, ప్రధానకార్యదర్శిగా సుమన్‌ను ఎన్నుకున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సర్పంచులు కృష్ణయ్య, శ్రీనివాస్, హన్యానాయక్, రాధావెంకట్రాంరెడ్డి, యాదమ్మశేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.