ఆరోగ్యశాఖకు నిధులు కేటాయించడంలో దేశంలోనే 3వ స్థానం
టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి
నారాయణపేట, మార్చి 12 : జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఎస్.రాజేందర్‌రెడ్డి హర్షం ప్రకటించారు. రాష్ర్టానికి సంబంధించి ఆరోగ్యశాఖ బడ్జెట్‌పై శనివారం అసెంబ్లీ సమావేశాల్లో ఎమ్మెల్యే ప్రసంగించారు. రాష్ట్రం ఆరోగ్యశాఖకు నిధులను ఖర్చు చేయడంలో దేశంలోనే 3వ స్థానంలో నిలిచిందని, ఇటీవలే రాజ్యసభలో కేంద్ర ప్రభుత్వం ప్రశంసిచడాన్ని గుర్తుచేశారు. వైద్య రంగానికి ఖర్చు చేయడంలో దేశంలోనే రాష్ట్రం ముందుంటుందన్నారు. గతేడాది బడ్జెట్ కన్నా ఈసారి 78శాత ఎక్కువగా ఆరోగ్యశాఖపై ఖర్చు పెడుతుందన్నారు. జిల్లాకు మెడికల్ కాలేజీ మంజూరు చేయడంపై సీఎం కేసీఆర్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రతి జిల్లాలో జిల్లా దవాఖానకు అనుబంధంగా నర్సింగ్ కాలేజీ ఏర్పాటు చేయాలని, దీంతో మెరుగైన వైద్య సేవలు అందుతాయని ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావును కోరారు. పేటలో డయాలసిస్ కేంద్రా న్ని ఏర్పాటు చేస్తామని గతంలోనే వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హామీ ఇచ్చారని, త్వరలో ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారు.