జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గౌని సురేఖారెడ్డి
సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం
మరికల్, మార్చి 11 : రాష్ట్రంలో అభివృద్ధే లక్ష్యంగా ప్ర భుత్వం పని చేస్తుందని జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గౌని సురేఖారెడ్డి అన్నారు. మండలంలోని హనుమాన్‌వాడలో ఉపాధి హామీ పథకం ద్వారా మంజూరైన రూ.10 లక్షల వ్యయం తో సీసీ రోడ్డు నిర్మాణ పనులను శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి పల్లె, ప్రతి కాలనీలో సీసీ రోడ్లు వేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు. ఆంజనేయస్వామి ఆల యం నుంచి పోచమ్మ ఆలయం వరకు సీసీ రోడ్డు పనులు చేపడుతామన్నారు. కార్యక్రమంలో వైస్‌ఎంపీపీ రవికుమా ర్, సర్పంచ్ గోవర్ధన్, ఎంపీటీసీ సుజాత, మండల కో ఆప్షన్ సభ్యుడు మతీన్, నాయకులు పాల్గొన్నారు.
పనులు నాణ్యతతో చేపట్టాలి
నారాయణపేట, మార్చి 11 : డ్రైనేజీ నిర్మాణ పనులను నాణ్యతతో చేపట్టాలని మున్సిపల్ కౌన్సిలర్ అనిత అన్నా రు. పట్టణంలో 2వ వార్డులోని అగ్రహార్పేట్లో పట్టణ ప్ర గతి నిధుల నుంచి చేపడుతున్న పనులను శుక్రవారం పరిశీలించారు. పనులను వెంటనే పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని ఆమె తెలిపారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సుభాష్, వార్డు అధ్యక్షుడు దేవరాజ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రతిఒక్కరూ సహకరించాలి
దామరగిద్ద, మార్చి 11 : గ్రామ అభివృద్ధికి ప్రతిఒక్క రూ సహకరించాలని టీఆర్ఎస్ గ్రామ నాయకుడు అశోక్ అన్నారు. మండలంలోని లింగారెడ్డిపల్లిలో సీసీ రోడ్డు నిర్మా ణ పనులకు శుక్రవారం భూమి పూజ చేసి ప్రారంభించారు. ఎన్ఆర్ఈజీఎస్ నుంచి మంజూరైన రూ.6 లక్షల నిధులతో సీసీ రోడ్డు వేస్తామన్నారు. ఈ సందర్భంగా అశోక్ మాట్లాడుతూ మండలకేంద్రం నుంచి ప్రతి గ్రామానికి రోడ్డు సౌక ర్యం ప్రభుత్వం కల్పించడం జరుగుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో నాయకుడు చిన్న నర్సిరెడ్డి పాల్గొన్నారు.