మాజీ ఎంపీ మంద జగన్నాథం
ఘనంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవం
ఇటిక్యాల, మార్చి 8: మహిళా అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వ ధేయ్యమని మాజీ ఎంపీ మంద జగన్నాథం పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని కొండేరులో ఏఎన్ఎంలకు అంగన్వాడీలు, ఆశలకు సారెలిచ్చి సన్మానించారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ నియోజకవర్గ మాజీ ఇన్‌చార్జ్జి మందశ్రీనాథ్, నాయకులు, శ్రీనివాసులు, బలరాం, రాగన్న లక్ష్మన్న, అంజి తదితరులు పాల్గొన్నారు.
అయిజ పట్టణంలో..
అయిజ, మార్చి 8: పట్టణంతోపాటు మండలంలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా ఉపాధ్యాయులను హెచ్ఎంలు, కరస్పాండెంట్లు సన్మానించారు. కార్యక్రమంలో హెచ్ఎం రవి, కరస్పాండెంట్ బాల వెంకట్‌రెడ్డి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
అలంపూర్ పీహెచ్సీలో..
అలంపూర్, మార్చి 8: మండల కేంద్రంలోని పీహెచ్సీలో డాక్టర్ సయ్యద్ బాషా, డాక్టర్ ప్రతిభాస్ఫూర్తి, మండల ఆరోగ్య విస్తరణ అధికారి లక్ష్మీకాంత్ ఆధ్వర్యంలో సీహెచ్‌సీ పరిధిలో విధులు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగులు, సిబ్బందిని శాలువా, పూలమాలతో సన్మానించారు. కార్యక్రమంలో ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ మారుతీనందన్, ఎన్ఎంలు, ఆశవర్కర్లు తదితరులు పాల్గొన్నారు.
మల్దకల్ మండలంలో..
మల్దకల్, మార్చి 8: మండలంలోని పాలవాయిలో వన్ ఫర్ వన్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మంగళవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సర్పంచ్ శివరామిరెడ్డి హాజరయ్యారు. అనంతరం అంగన్వాడీ టీచర్లు, ఏఎన్ఎం, ఆశ కార్యకర్తలను సంస్థ అధ్యక్షురాలు సులామీతమ్మ శాలువా, పూలమాలతో సన్మానించి స్వీట్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో నిర్వాహకులు ఈదన్న, జయంతుడు, సురేందర్, లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు. అలాగే మల్లెందొడ్డి రైతువేదిక భవనంలో సర్పంచ్ వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీటీసీ పరశురాముడు ఆధ్వర్యంలో ఏఎన్ఎంలు, ఆశ, అంగన్వాడీ టీచర్లను శాలువా, పూలమాలలతో సన్మానించారు. కార్యక్రమంలో వార్డుమెంబర్లు, గ్రామపెద్దలు తదితరులు పాలొన్నారు.
గద్వాల పట్టణంలో..
గద్వాలటౌన్, మార్చి 8: అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని మహిళా మోర్చా ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో జిల్లా ప్రధాన కార్యదర్శి డీకే స్నిగ్ధారెడ్డి కేక్‌కట్ చేశారు. అనంతరం మహిళలు ఒకరికొకరు శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో మహిళా మోర్చా నాయకురాలు బండల పద్మావతి, కృష్ణవేణి, జయశ్రీ, అక్కల రమాసాయిబాబ తదితరులు పాల్గొన్నారు.
గద్వాల మండలంలో..
గద్వాల అర్బన్, మార్చి 8: మహిళలు నేటి సమాజంలో అన్నిరంగాల్లో రాణించాలని ప్రభుత్వ, ప్రైవేట్, ప్రజ, విద్యార్థి, స్వచ్ఛంద సంస్థ సభ్యులు పేర్కొన్నారు. జిల్లా కేంద్రంలోని పలు కార్యాలయలలో మహిళా దినోత్సవాన్ని నిర్వహించుకున్నారు. మహిళలను శాలువాలతో సన్మానించారు.
గట్టు కళాశాలలో..
గట్టు, మార్చి 8: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రిన్సిపాల్ శశిధర్‌రెడ్డి ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా జరుపుకొన్నారు. ఈ సందర్భంగా అధ్యాపకురాలు రాధిక, జూనియర్ అసిస్టెంట్లను ఘనంగా సన్మానించారు. విద్యార్థులకు కబడ్డీ, క్విజ్, వ్యాసరచన, డ్రాయింగ్ పోటీలు నిర్వహించారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో లెక్చరర్లు పాల్గొన్నారు.