మహిళలకు అధిక ప్రాధాన్యత
ఎంపీ మన్నె, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
జడ్చర్ల, మార్చి 8: అర్హులైన పేదలందరికీ డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇస్తున్న రాష్ట్రం ఏదైనా ఉందంటే అది తెలంగాణ అని ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మారెడ్డి అన్నారు. మండలంలోని ఖానాపూర్‌లో ప్రభుత్వం రూ.కోటి 21లక్షలతో 24డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించింది. ఎమ్మెల్యేతో కలిసి ఎంపీ మన్నె మంగళవారం ప్రారంభించారు. అంతకుముందు గ్రామంలోని పల్లెప్రకృతినవం, నర్సరీ, వైకుంఠధామాలను ప్రారంభించారు. అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్ల వద్ద లబ్ధిదారులకు ఇండ్ల పట్టాలను అందజేసి మాట్లాడారు. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సీఎం కేసీఆర్ పేదలు సంతోషంగా ఉండాలని ఎన్నో అభివృద్ధి, సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలుచేస్తున్నారని అన్నారు. ఆడబిడ్డల పెండ్లిళ్లకు కల్యాణలక్ష్మి, బాలింతలకు కేసీఆర్ కిట్ తదితర పథకాలను అమలు చేస్తున్న ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వమన్నారు. ఇంటిస్థలం ఉండి ఇల్లు నిర్మించుకోలేని పేదలకు నిర్మాణానికి రూ.3లక్షలు కేటాయించారు. సీఎం కేసీఆర్ మహిళలకు అన్ని రంగాల్లో అధిక ప్రాధాన్యత ఇస్తున్నారన్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య, బాద్మి శివకుమార్, సర్పంచ్ అరుణ, సర్పంచుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రణీల్‌చందర్, పీఏసీసీఎస్ అధ్యక్షుడు సుదర్శన్‌గౌడ్, రైతుబంధు సమితి కోఆర్డినేటర్ జంగయ్య, సర్పంచులు రాజేశ్వర్‌రెడ్డి, నర్సింహులు, తాసిల్దార్ లక్ష్మినారాయణ, విద్యుత్‌శాఖ ఏడీఈ శ్రీనివాస్, ఏఈ నరేందర్‌గౌడ్, ఆర్ఐ రాఘవేంద్ర, ఏఈ పీఆర్ జవహార్‌బాబు, మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి లలితాకుమారి, పార్టీ మండలాధ్యక్షుడు రఘుపతిరెడ్డి, కోట్ల ప్రశాంత్‌రెడ్డి, మార్కెట్ డైరెక్టర్ శ్రీకాంత్‌రెడ్డి, నాయకులు ప్రహ్లాద్‌రెడ్డి, సత్యనారాయణ, శ్రీనివాస్‌రెడ్డి, నాగిరెడ్డి, సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.