వనపర్తి రూరల్, మార్చి 8: వనపర్తి జిల్లాలోని చిట్యాల గ్రామ శివారులో 44ఎకరాల్లో రూ.44.5 కోట్లతో నిర్మించిన నూతన వ్యవసాయ మార్కెట్‌ను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రారంభించారు. అంతకుముందు మంత్రులు నిరంజన్‌రెడ్డి శ్రీనివాస్‌గౌడ్, నాగర్‌కర్నూల్ పార్లమెంట్ సభ్యుడు రాములు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నూతన మార్కెట్‌కు ఎదురుగా ఉన్న హెలీప్యాడ్ వద్దకు వెళ్లి సీఎంకు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం సీఎం ప్రత్యేక బస్సులో మార్కెట్లోకి వచ్చి నూతన వ్యవసాయ మార్కెట్ యార్డు శిలాఫలకాన్ని ప్రారంభించారు. వ్యవసాయ మార్కెట్లో రైతులను పలకరించారు. ప్రత్యేక బస్సులో వనపర్తి జిల్లా కేంద్రానికి బయలుదేరిన సీఎంకు అడుగడుగునా ప్రజలు ఘనంగా బోనాలు, పూలవర్షంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో సీఎస్ సోమేశ్‌కుమార్, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాగర్‌కర్నూల్ ఎంపీ రాములు, జిల్లా పరిషత్ చైర్మన్ లోకనా
థ్‌రెడ్డి, దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, కొల్లాపూర్ ఎమ్మె ల్యే హర్షవర్ధన్‌రెడ్డి, వ్యవసాయశాఖ కమిషనర్ రఘునందన్‌రావు, గిడ్డంగులశాఖ చైర్మన్ సాయిచంద్, ఎమ్మె ల్సీ కశిరెడ్డి నారాయణరెడ్డి, కలెక్టర్ షేక్ యాస్మిన్‌బాషా, మార్కెట్‌యార్డు చైర్మన్ లక్ష్మారెడ్డి, గొర్రెల కాపరుల సంఘం చైర్మన్ కురుమూర్తి యాదవ్, ఎంపీపీ కిచ్చారెడ్డి, సర్పంచ్ భానుప్రకాశ్‌రావు, సింగిల్ విండో అధ్యక్షులు వెంకట్రావు, మధుసూదన్‌రెడ్డి, అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.