మంత్రి చదివిన పాఠశాలలోనే ‘మన ఊరు-మనబడి’ ప్రారంభం
గులాబీమయంగా మారిన వనపర్తి పట్టణం
వనపర్తి, మార్చి 6 (నమస్తే తెలంగాణ) : ఈ నెల 8న సీఎం కేసీఆర్ వనపర్తి జిల్లా పర్యటన నేపథ్యంలో పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేపడుతున్నారు. సభా ప్రాంగణాల వద్దకు కుర్చీలు, సామగ్రి తీసుకొచ్చారు. ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’ కార్యక్రమం ప్రారంభం సందర్భంగా వనపర్తి జెడ్పీ పాఠశాల మైదానంలో ఏ ర్పాటు చేసిన సభావేదికకు పరిమిత సంఖ్యలో ప్రజలను అనుమతిస్తున్నారు. ఈ క్రమంలో అవసరమైన మేరకు కుర్చీలు, తాగునీటి వసతి వంటి ఏర్పాట్లు చేస్తున్నారు. అలాగే పలు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల వద్దకు కూడా అవసరమైన సామగ్రిని తరలించారు. కటౌట్లు, జెండాలు, తోరణాల కో సం కర్రలను పాతారు. బహిరంగ సభా ప్రాంగణం వ ద్ద సౌండ్ సిస్టం, మైకులు సిద్ధం చేస్తున్నారు. సభా వేది క మీద అతిథులు కూర్చునేందుకు వీలుగా లారీల్లో కుర్చీలు తెప్పించారు. సుమారు 40 ఎకరాల్లో బహిరంగ సభను ప్లాన్ చేస్తున్నారు. పార్కింగ్, తాగునీటి సౌకర్యంతోపాటు మహిళలకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఏదైనా కారణాలతో సభ ఆలస్యమైతే ఇబ్బందులు కలగకుండా హైమాస్ట్‌లైట్లు బిగిస్తున్నారు. సభకు వచ్చే వారికి భోజనాల ఏర్పాట్లు చేస్తున్నారు.
వెనుకబడిన ప్రాంతం నుంచే..
వనపర్తి టౌన్, మార్చి 6 : ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేసేందుకు సర్కార్ నడుం బిగించింది. వి ద్యతోనే సమాజాభివృద్ధి జరుగుతుందన్న ఉద్దేశంతో నిధులు విడుదల చేసింది. దశలవారీగా ఉద్యమ ఆకాంక్షను నెరవేరుస్తున్నది. ప్రాజెక్టుల నిర్మాణం, చెరువుల పునరుద్ధరణ, విద్య, వైద్యం బలోపే తం చేసేందుకు ప్ర తి జిల్లా కేంద్రంలో మెడికల్ కళాశాల ఏర్పాటు చే సింది. పేద విద్యార్థులకు ఆంగ్ల మా ద్యమాన్ని అందించాలన్న లక్ష్యంతో ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఈ కార్యక్రమాన్ని అమలు చేసేందుకు మంత్రి నిరంజన్‌రెడ్డి కోరిక మేరకు వెనుకబడిన పాలమూరు ప్రాంతాన్ని ఎంచుకున్నది. ఇందులో భాగంగా వనపర్తిలో మంత్రి చదివిన పాఠశాలలోనే అంకురార్పణ చేయనున్నది. మంత్రి నిరంజన్‌రెడ్డి వనపర్తి బా లుర ఉన్నత పాఠశాలలో విద్యాభ్యాసాన్ని పూర్తిచేశారు.
అక్కడి నుంచే ‘మన ఊరు-మన బస్తీ-మన బడి’ని ప్రారంభించేందుకు పైలాన్‌ను ఏర్పాటు చేశా రు. విద్యార్థులతో సీఎం కేసీఆర్ ముఖాముఖిగా సమావేశమయ్యేందుకు మైదానంలో సభను కూడా ఏర్పా టు చేశారు. వచ్చే అకాడమిక్ ఇయర్ నుంచి అన్ని ప్ర భుత్వ పాఠశాలల్లో 1-8వ తరగతి వరకు ఆంగ్ల మా ద్యమాన్ని ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ఈ కార్యక్ర మంలో భాగంగా తొలి విడుతలో వనపర్తి జిల్లాలో 181 పాఠశాలలను ఎంపిక చేశారు. ఈ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించనున్నారు. ఇదిలా ఉండగా, సీఎం పర్యటన సందర్భంగా జిల్లా కేంద్రం గులాబీమ యమైంది. చిట్యాల మార్కెట్ యార్డు నుంచి గాంధీచౌక్, కొత్త బస్టాండ్, అంబేద్కర్, రాజీవ్ చౌరస్తా మీదుగా సభా ప్రాంగణం వరకు రోడ్డుకిరువైపులా గులాబీ జెండాలు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అలాగే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొట్టమొదటిగా వనపర్తిలోనే కలెక్టరేట్ ప్రారంభంకానున్నది.