ఎమ్మెల్యే ఆల సమక్షంలో టీఆర్ఎస్లో చేరిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు
భూత్పూర్, మార్చి 6 : అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నాయకులు, కార్యకర్తలు టీఆర్ఎస్లో చేరుతున్నారని ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి తెలిపారు. ఆదివారం మండలంలోని తాటిపర్తి గ్రామంలో బీజేపీ మండల ఉపాధ్యక్షుడు శివకుమార్‌తోపాటు 30 మంది.. అలా గే కాంగ్రెస్‌కు చెందిన 20 మంది నాయకులు ఎమ్మెల్యే సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. మూసాపేట మండలం నిజాలాపూర్ గ్రామానికి చెందిన శ్రీనివాసులు కాంగ్రెస్‌ను వీడి కారెక్కారు. అనంతరం కొత్తూర్‌లో డబుల్‌బె డ్రూం ఇండ్ల నిర్మాణానికి స్థలాన్ని పరిశీలించా రు. కార్యక్రమంలో ఎంపీపీ శేఖర్‌రెడ్డి, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, జెడ్పీటీసీ ఇంద్రయ్యసాగర్, సింగిల్‌విండో చైర్మన్ అశోక్‌రెడ్డి, కౌన్సిలర్ శ్రీనివాస్‌రెడ్డి, కో ఆప్షన్ సభ్యుడు అజీజ్, సర్పంచ్ వెంకటయ్య, మాజీ ఎంపీపీ చంద్రశేఖర్‌గౌడ్, నాయకులు నారాయణగౌ డ్, సత్యనారాయణ, మురళీధర్‌గౌడ్, పర్వతా లు, కాశీపాండ్యన్ పాల్గొన్నారు.