ప్రభుత్వ సంస్థలను తాకట్టు పెడుతున్న కేంద్రం
సీఎం సభకు భారీగా తరలిరావాలి
సన్నాహక సమావేశంలో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి
హాజరైన జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణ సుధాకర్‌రెడ్డి, ఎమ్మెల్యే ఆల
భూత్పూర్, మార్చి 5 : సీఎం కేసీఆర్ దేశ రాజకీయాలను శాసిస్తారని టీఆర్ఎస్ మహబూబ్‌నగర్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి తెలిపారు. ఈ నెల 8వ తేదీన వనపర్తిలో సీఎం పర్యటన సందర్భంగా శనివారం భూత్పూర్లోని కేఎంఆర్ ఫంక్షన్హాల్లో భూత్పూర్, మూసాపేట, అడ్డాకుల మం డలాల నాయకులతో సన్నాహక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా లక్ష్మారెడ్డి మాట్లాడు తూ 2001లో టీఆర్ఎస్ను స్థాపించిన సమయం లో కూడా ప్రతిపక్షాలు ఎద్దేవా చేశారన్నారు. చివరకు రాష్ర్టాన్ని సాధించి చూయించారన్నారు. ఇప్పు డు కూడా దేశంలో సీఎం కేసీఆర్‌కు పరిస్థితులు అ నుకూలంగానే ఉన్నాయన్నారు. కేంద్ర ప్రభుత్వం మతతత్వాన్ని రెచ్చగొట్టి ఓట్లను దండుకుంటున్నదని, పెట్రోల్ ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయని విమర్శించారు. ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఎల్ఐసీ, రైల్వే వ్యవస్థలను తాకట్టు పెట్టిందన్నారు. కేంద్ర ప్ర భుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టడంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందన్నారు.
జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ సీఎం బహిరంగసభకు భారీగా తరలిరావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ కేసీఆర్ మహిళాబంధు కార్యక్రమాన్ని 6, 7, 8వ తేదీ ల్లో నిర్వహించాలని కోరారు. పాలమూరు-రంగారెడ్డి పనులు పూర్తి కాకుండా బీజేపీ, కాంగ్రెస్ నాయకులు కేసులు వేయడం దారుణమన్నారు. సమావేశంలో సంగీత, నాటక అకాడమీ మాజీ చైర్మన్ బా ద్మి శివకుమార్, మున్సిపల్ చైర్మన్ బస్వరాజ్‌గౌడ్, ఎంపీపీలు శేఖర్‌రెడ్డి, నాగార్జునరెడ్డి, జెడ్పీటీసీలు రాజశేఖర్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్, సింగిల్‌విండో చై ర్మన్ అశోక్‌రెడ్డి, కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, బాలకోటి, కో ఆప్షన్ సభ్యులు అజీజ్, జాకీర్, టీఆర్ఎస్ మం డలాధ్యక్షులు లక్ష్మీనర్సింహయాదవ్, శ్రీనివాస్‌రెడ్డి, నాయకులు నారాయణగౌడ్, సత్యనారాయణ, సా యిలు, నర్సింహులు, రాములు, రామురాథోడ్, ఆంజనేయులు, శంకర్, అశోక్, సురేశ్, ప్రేమ్, రా కేశ్ తదితరులు పాల్గొన్నారు.