శివనామస్మరణతో మార్మోగిన ఆత్మకూరు
పెద్ద సంఖ్యలో దాసంగాలు
కనులపండువగా రథోత్సవం
అలరించిన కోలాటం, జంగిరెడ్డి కళా ప్రదర్శనలు
ఆత్మకూరు, మార్చి 5 : ఆత్మకూరు చెరువులో కొలువుదీరిన పరమేశ్వరస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. శనివా రం మూడో సవారీ (ప్రభా రథోత్సవం)ని కనుల పండువగా నిర్వహించారు. ‘హరహర మహాదేవ.. శంభో శంకర’ నామస్మరణతో ఆత్మకూరు పట్టణం మార్మోగింది. మూడో సవారీ, శనివారం కావడంతో భక్తులు తెల్లవారుజామున నుంచే దర్శనానికి బారులుదీరారు. పెద్దసంఖ్యలో దాసంగాలు పెట్టి నైవేద్యాలు సమర్పించారు. ఉపవాస దీక్షలు చేపట్టిన మహిళలు నైవేద్యాల సమర్పణ అనంతరం దీక్షలను విరమించారు. సాయంత్రం పల్లకీసేవను వేంకటేశ్వరస్వామి ఆలయం నుంచి పరమేశ్వరస్వామి ఆలయం వరకు నిర్వహించారు. ఊరేగింపులో కోలాటం ఆకట్టుకున్నది. భక్తుల దర్శనార్థం ప్రభారథోత్సవంపై ఆసీనుడైన స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుదీరా రు. మున్సిపల్ చైర్పర్సన్ గాయత్రియాదవ్ దంపతులు, ఎంపీపీ శ్రీనివాసులు, వైస్ ఎంపీపీ కోటేశ్వర్, వైస్ చైర్మన్ విజయభాస్కర్‌రెడ్డి, జెడ్పీటీసీ శివరంజని, పీఏసీసీఎస్ అధ్యక్షుడు కృష్ణమూర్తి, మాజీ ఎంపీపీ శ్రీధర్‌గౌడ్, కౌన్సిలర్లు, కోఆప్షన్‌సభ్యులు స్వామివారికి పూజలు నిర్వహించారు. జా తర ప్రాంగణంలో ఏర్పాటు చేసిన పటాకుల కా ర్యక్రమం చిన్నారులను ఆకట్టుకున్నది. జాతర అ భివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ జానపద క ళాకారుడు జంగిరెడ్డి గీతాలాపన చేశారు. కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, భక్తులు పాల్గొన్నారు.