ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి
మక్తల్‌టౌన్, మార్చి5: రాజకీయంగా ఎదుర్కోలేక మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌పై హత్యకు కుట్ర పన్నారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఎమ్మెల్యే నివాసంలో మీడియా సమావేశంలో మాట్లాడు తూ రాజకీయంగా ఎదుర్కోలేక హత్యా రాజకీయాలకు పాల్పడటం సిగ్గుచేటన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆశాజ్యోతిగా ఉన్న మంత్రిపై ఇలాంటి కుట్రలు చేస్తే సహించబోమన్నారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించి ఈ ప్రాంతం అబివృద్ధి చెందాలని నిరంతరం కృషి చేస్తున్నారని, ఈ విషయాన్ని జీర్ణించుకోలేక కొందరు మంత్రిని హతమార్చడానికి కుట్ర చేశారని తెలిపారు. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని కోరారు. కుట్రపన్నిన దోషులను శిక్షించాలని డిమాండ్ చేశారు. మంత్రి నిరంతరం కష్టపడుతూ నిరంతరం జిల్లా కేంద్రంతో పాటు ఉమ్మడి జిల్లా అబివృద్ధ్దికి కృషి చేస్తున్నారని ముఖ్యంగా విద్య, వైద్యం, నీటిపారుదల విషయంలో ఎంతో కృషి చేశారని తెలిపారు. రాజకీయాల్లో హింసకు తావులేదని గుర్తు చేసుకోవాల్సిన అవసరముందని, సూత్రధారులలో ఒకరు హత్యకు పాల్పడింది నిజమేనని తెలిపారు అసలైన దోషులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే చిట్టెం తెలిపారు.
నిందితులను కఠినంగా శిక్షించాలి
నర్వ, మార్చి 5: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను హత్యచేసేందుకు కుట్రపన్నిన నిందితులను, కుట్ర వెనుకల ఉన్న సూ త్రధారులను కఠినంగా శిక్షించాలని నర్వ మండల గౌడసంఘం అధ్యక్షులు కె. లక్ష్మన్‌గౌడ్ అన్నారు. శనివారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారుడిగా, ఉద్యోగసంఘంనేతగా, ఎమ్మెల్యే, రాష్ట్రమంత్రిగా ప్రజల్లో ఎనలేని అభిమానం సంపాందించుకున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకనే కొన్నిశక్తులు ఇలా పిరికిపంద చర్యలకు పాల్పడ్డాయన్నారు. మహబూబ్‌నగర్‌ను గతంలో ఎన్నడూ లేనివిధంగా అభివృద్ధి చేస్తుండటంతో తమ రాజకీయ జీవితం ప్రశ్నార్థ్థకంగా మారుతుందని భావించిన కొందరు ప్రతిపక్షనాయకులు ఇలాంటి చర్యలకు పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. కార్యక్రమంలో గౌడసంఘం నాయకులు పాల్గొన్నారు.