మహబూబ్‌నగర్, మార్చి 5 : అంగన్వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు క్రమం తప్పకుండా పౌష్టికాహారం అం దించాలని కలెక్టర్ ఎస్.వెంకట్రావు అన్నారు. కలెక్టరేట్లోని రెవెన్యూ సమావేశ మందిరంలో శనివారం డీడబ్ల్యూవో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. కొవిడ్‌తో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు సీఎంకేర్ నుంచి ఐసీడీఎస్ తరఫున ఆర్థిక సహకారం అందేలా చూడాలన్నారు. సఖీ కేంద్రంలో అంతర్గత ఫిర్యాదులకు సంబంధించి ఏర్పాటు చేసిన కమిటీ సమావేశాలను క్రమం తప్పకుండా ప్రతినెలా నిర్వహించాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం పంపిణీపై నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్, సంక్షేమాధికారి జరీనాబేగం ఉన్నారు.
వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలి
మహబూబ్‌నగర్‌టౌన్, మార్చి 5 : పదోతరగతి వార్షిక పరీక్షలకు విద్యార్థులను సిద్ధం చేయాలని కలెక్టర్ వెంకట్రావు సూచించారు. జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలలో ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరుశాతాన్ని పరిశీలించారు. అనంతరం పదోతరగతి విద్యార్థులకు పలు ప్రశ్నలు వేసి సామర్థ్యాన్ని తెలుసుకున్నారు. పాఠశాల పరిసరాలను శుభ్రంగా ఉంచేందుకు సహకరించాలని మున్సిపల్ కమిషనర్‌కు సూచించారు. కలెక్టర్ వెంట డీఐఈవో వెంకటేశ్వర్లు ఉన్నారు.