మరికల్, మార్చి 3 : అభివృద్ధి పనులపై అధికారులు ని ర్లక్ష్యం చేస్తే సహించేది లేదని, గ్రామాల అభివృద్ధికి సర్కార్ పెద్దపీట వేస్తుందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలకేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయంలో గురువారం ఎంపీపీ శ్రీకళారెడ్డి అధ్యక్షతన మండ ల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ముందుగా ఎంపీటీసీ మణెమ్మ మృతికి సంతాపం తెలిపి రెండు నిమిషాలు మౌనం పాటించారు. అనంతరం వివిధ శాఖల అధికారు లు నివేదికలు చదువగా ఎంపీటీసీలు, సర్పంచులు పలు ప్రశ్నలు వేశారు. అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వకపోవడంతో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రశ్నలకు సమాధానాలు ఎందుకు ఇవ్వడం లేదని, అధికారులు అభివృద్ధికి సహకరించాలని, పనితీరు మారాలన్నా రు. ఈనెలలో ప్రారంభం కానున్న ‘మన ఊరు-మన బడి’ కార్యక్రమం గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలలు అభివృద్ధి చేసుకోవాలని ఆయన సూచించారు. మండలకేంద్రంలో అదనపు తరగతి గదులు లేక విద్యార్థులు ఆవస్థలు పడుతున్నారని ఎంపీటీసీ గోపాల్, సర్పంచ్ గోవర్ధన్ సభ దృష్టికి తీసుకొచ్చారు. అదనపు తరగతి గదులు కూడా ‘మన ఊ రు-మన బడి’ కార్యక్రమంలో నిర్మించుకోవాలని ఎమ్మెల్యే సూచించారు.
పేదల భూములు నిషేధి త జాబితాలో ఉన్న అధికారులు పట్టించుకోవడం లేదని సభ్యులు ప్రశ్నించా రు. మండలం నుంచి నిషేధిత భూ ములను తొలగించాలని ఫిర్యాదు చేసి న కలెక్టర్ కార్యాలయంలో అధికారు లు చేయడం లేదని సర్పంచులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో రైతులు పొ లాలను విక్రయించడం, కొనుగోలు చేయడం లేదన్నారు. కలెక్టర్ కార్యాలయ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. మరికల్ పెద్ద చెరువు వద్ద పట్ట భూములు లేవని, ప్రభుత్వం భూములుంటే వా టిని అభివృద్ధి చేసి పార్కులను ఏర్పాటు చేయాలని అధికారులను ఎమ్మెల్యే ఆదేశించారు. వివిధ అంశాలపై సభ్యులు చర్చించారు. సమావేశంలో పేట జెడ్పీ వైస్‌చైర్‌పర్సన్ గౌని సురేఖారెడ్డి, వైస్‌ఎంపీపీ రవికుమార్, జిల్లా పరిషత్ కో ఆ ప్షన్ సభ్యుడు వాహిద్, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ సంపత్, ఎంపీడీవో యశోదమ్మ, డిప్యూటీ తాసిల్దా ర్ జగన్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, అధికారులు, కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.
దేశానికే తెలంగాణ ఆదర్శం
ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శనీయమని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. మండలంలోని కొల్లూరులో ఎన్ఆర్జీఎస్ నిధులతో చేపట్టిన సీసీ రోడ్డు నిర్మాణం పనులను గురువారం ఎమ్మెల్యే భూమి పూజ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఏ కార్యక్రమం ప్రారంభించినా దేశానికే దిక్సూచిగా తెలంగాణ రాష్ట్రం నిలుస్త్తుందన్నారు. తన హయాంలో మారుమూల గ్రామాలకు సైతం తారు రోడ్డు వేయించామన్నారు. కొల్లూ రు, సంస్తాంపూర్ గ్రామాల్లో ఎన్ఆర్ఈజీఎస్ నిధులు రూ. 5 లక్షలతో సీసీ రోడ్డు పనులను ప్రారంభించినట్లు పంచాయతీరాజ్ ఏఈ జగత్‌చంద్ర తెలిపారు. కార్యక్రమంలో ఎం పీపీ లక్ష్మి, జెడ్పీటీసీ అశోక్‌కుమార్‌గౌడ్, పీఏసీసీఎస్ చైర్మన్ బాల్‌రెడ్డి, ఎంపీడీవో కాళప్ప, సర్పంచులు, ఎంపీటీసీ వియలక్ష్మి, మాజీ జెడ్పీటీసీ అరవింద్‌కుమార్, టీఆర్ఎస్ మండ ల అధ్యక్షుడు లక్ష్మారెడ్డి, గ్రామ అధ్యక్షుడు గోవిందరాజు లు, నాయకులు పాల్గొన్నారు.