కనుల పండువగా జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవార్ల కల్యాణం
హాజరైన మంత్రి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం దంపతులు
అలంపూర్, మార్చి 2 : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లింగోద్భవ కాలంలో బుధవారం తెల్లవారుజామున 2 గం టలకు ఆదిదంపతులైన జోగుళాంబ, బాలబ్రహ్మేశ్వర స్వామి, అమ్మవార్ల కల్యాణాన్ని కనుల పండువగా నిర్వహించారు. అమ్మవారి ఆ లయ రాజగోపురం ప్రాంగణంలో ప్రత్యేకంగా అలకంరించిన మం డపంపై కల్యాణం జరిపించారు. భక్తులు ఈ వేడుకను తిలకించి పునీతులయ్యారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జె డ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం, మున్సిపల్ చైర్పర్సన్ మ నోరమ దంపతులు కల్యాణానికి హాజరయ్యారు. అంతకుముందు మంగళవారం రాత్రి ఆకాశజ్యోతిని ఎగరవేశారు. అలాగే బుధవారం రాత్రి రథోత్సవాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. సాంప్రదాయం ప్రకారం శ్రీనివాసరెడ్డి వారసులు రథంపై పోల్ చల్లి, గు మ్మడి కాయ బలిహరణ చేసి రథాన్ని లాగారు. ఉత్సవమూర్తులను అశ్వ వాహనంపై తీసుకొచ్చి రథోత్సవంపై కూర్చోబెట్టారు. ఊరేగిం పు తరువాత విగ్రహాలను ఆలయానికి చేర్చారు. ఎస్సై శ్రీహరి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు. మంగళవారం రాత్రి భక్తుల జాగరణ కోసం దేవస్థానం ఆధ్వర్యంలో తెల్లవారుజామున వరకు పుష్కరఘాట్ వద్ద జోగుళాంబ కళా సమితి వారిచే నాటకాలను ప్రదర్శించారు. మహబూబాబాద్ నుంచి వచ్చిన తాండవ కృష్ణ భరత నాట్య మండలి చిన్నారుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. కళాకారులు చంద్రయ్యాచారి, లక్ష్మన్న, వేమారెడ్డి, అయ్యన్న పాత్రులను మె మోంటోలతో సత్కరించారు. అనంతరం జోగుళాంబ సహిత బాలబ్రహ్మేశ్వర స్వామి వారిని బుధవారం ఉదయం నంది వాహనం, సాయంత్రం హంస వాహనంపై ఊరేగించారు. పట్టణంలోని కూడవెల్లి సంగమేశ్వర స్వామి ఆలయంలో భవాని, పరమేశ్వరుల కల్యాణాన్ని కూడవెల్లి గ్రామ కమిటీ సభ్యులు జరిపించారు.
ఆలయాలను దర్శించుకున్న ప్రముఖులు..
వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఎమ్మెల్యే అబ్రహం దంపతులు మంగళవారం రాత్రి జోగుళాంబ బాలబ్రహ్మేశ్వర స్వామి ఆలయాలను దర్శించుకున్నారు. వా రికి ఈవో పురేందర్ కుమార్ స్వాగతం పలికారు. స్వామి వారి ఆలయంలో రుద్రహోమం, గణపతి పూజ, బాలబ్రహ్మేశ్వర స్వామికి లింగోద్భవ కాలంలో అభిషేకం నిర్వహించారు. అనంతరం పల్లకీసేవలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో ఎమ్మెల్యే అబ్రహం కుమారుడు అజయ్, నాయకులు వెంకట్రాముడు, పల్లయ్య, వెంకట్రామయ్యశెట్టి, ఆలయ సిబ్బంది చంద్రయ్యాచారి, శ్రీనివాసులు, రంగనాథ్, బ్రహ్మయ్యాచారి తదితరులు పాల్గొన్నారు.