రూ.35 కోట్లతో 150 పడకల దవాఖాన ఏర్పాటు చేస్తాం
ప్రజలకు అందుబాటులో వైద్యులు ఉండాలి
మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి
మక్తల్ టౌన్, మార్చి 2 : పట్టణంలో రూ.35 కోట్లతో 150 పడకల దవాఖాన ఏర్పాటు చేస్తామని, కరోనా సమ యంలో ఆశ వర్కర్ల సేవలు మరువలేనివి అని మక్తల్ ఎ మ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. పట్టణంలోని ప్ర భుత్వ దవాఖానలో ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు బుధవారం ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఆశ వర్కర్లకు దేశంలో ఏ ప్రభుత్వం ఇవ్వలేని జీతాలను పెంచి వారి సేవలను గుర్తించారని పే ర్కొన్నారు. ప్రభుత్వం వైద్య సిబ్బందికి అన్ని సౌకర్యాలు కల్పించిందన్నారు. అదేవిధంగా మక్త ల్ ప్రభుత్వ దవాఖానలో పేదలకు అం దుబాటులో ఉండే విధంగా వైద్యులకు కొరత లేకుండా అదికారులు చూసుకోవాలన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్వో రామ్మనోహర్రావు, డాక్టర్లు సి ద్ధప్ప, శ్రీకాంత్, యాద్గిరి, ఆశ వర్క ర్లు తదితరులు పాల్గొన్నారు.
లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ..
లయన్స్ క్లబ్ సేవా కార్యక్రమాల్లో ముందుంటుందని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం అన్నారు. పట్ట ణంలోని పడమటి ఆంజనేయస్వామి ఆలయ ఆవరణలో అమావాస్యను పురస్కరించుకొని లయన్స్ క్లబ్ సభ్యులు ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు రమేశ్ రావు, కోశాధికారి అంబాదాస్, కొండయ్య, పృథ్వీరాజ్, కో ళ్ల వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.