నారాయణపేట టౌన్, మార్చి 2 : జి ల్లాలో పోషకాహారంతో భాధపడుతున్న చిన్నారులను గుర్తించి వారికి పౌష్టికాహా రం అందజేసే బాధ్యత అంగన్వాడీ టీచ ర్లు, సూపర్వైజర్లదేనని అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి అన్నారు. పట్టణంలోని కలెక్టర్ కార్యాలయంలో సీడీపీవోలు, సూపర్వైజర్లతో బుధవారం సమీక్షా సమావే శం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ చిన్న వయస్సులోనే పెండ్లిళ్లు కావడం, గర్భిణులు సరైన పోషకాహారం తీసుకోకపోవడం వల్ల రక్తహీనతతో బాధపడడంతోపాటు పుట్టిన పి ల్లలు కూడా సరైన ఎదుగుదల లేకపోవడం, ఎత్తు కు తగిన బరువు లేకుండా ఉంటారని పేర్కొన్నా రు. గర్భిణులకు తరచుగా హిమోగ్లోబిన్ పరీక్షలు నిర్వహించి పౌష్టికాహారంతోపాటు ఐరన్ మాత్ర లు, ఇంజక్షన్లు ఇప్పించాలన్నారు.
పోషకాహార కొరత తీర్చేందుకుగానూ అంగన్వాడీ కేంద్రాల్లో కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేశామన్నారు. వారంలో ఒకసారి సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి, ఆశ కార్యకర్త, అంగన్వాడీ టీచర్లు కలి సి సమావేశం ఏర్పాటు చేసుకోవాలన్నారు. సీడీపీవోలు, సూపర్వైజర్లు అంగన్వాడీ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ, శిశు సంక్షేమ శాఖలు సంయుక్తంగా పని చేసి జిల్లాలో చిన్నారులు పోషకాహారంతో బాధపడకుండా చర్యలు చేపట్టాలన్నారు. బాల్య వివాహాలను అరికట్టాలని, బాలలందరూ బడిలో ఉండే లా చర్యలు తీసుకోవాలని సూచించారు. సమావేశంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రా మ్మనోహర్రావు, సీడీపీవోలు, సూపర్వైజర్లు తదితరులు పాల్గొన్నారు.