దేశ రాజకీయాల్లోకి వెళ్లకుండా యత్నిస్తున్న కమలం నేతలు
ఉక్రెయిన్‌లో ఉన్న విద్యార్థులను తీసుకురావడంలో కేంద్రం విఫలం : ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు
అచ్చంపేట, మార్చి 2 : రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేయని కేంద్ర ప్రభుత్వం వైఫల్యాలను ఎత్తిచూపు తూ దేశం బాగు కోసం అడుగులు వేస్తున్న సీఎం కేసీఆర్ కట్టడి కోసం బీజేపీ నేతలు పాకులాడుతున్నార ని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు విమర్శించారు. తెలంగాణ ప్రజలకు అపకీర్తి తెచ్చేవిధంగా రాష్ట్ర కమలం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తా రు. బుధవారం అచ్చంపేట మినీ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్ జాతీయ స్థాయి రాజకీయాల్లోకి ప్రవేశిస్తుండడంతో భయపడి అడ్డుకునేందుకు బీజేపీ నేతలు నానా హంగామా సృష్టిస్తున్నారని అన్నారు. మాట వినకుంటే బెదిరించే విధంగా వారి వ్యవహారం ఉన్నదన్నా రు. సీఎం కేసీఆర్ భయపడే వ్యక్తి కాదు.. తెలంగాణ సాధించిన గొప్పనాయకుడని కొనియాడారు. ఇలాంటి చిల్లర బెదిరింపులకు ముఖ్యమంత్రి గానీ.. టీఆర్ఎస్ పార్టీ లొంగదన్నారు. చిల్లర రాజకీయాలు పక్కన పెట్టి ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయులను ఎందుకు ఇన్ని రోజుల నుంచి రప్పించలేకపోతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగాన్ని విస్మరిస్తున్నందు న ప్రాంతీయ పార్టీలు దేశం ప్రయోజనాల కోసం ఒక్కటిగా ముందుకెళ్తున్నాయని చెప్పారు. రాజకీయంగా ఎ దగాలనే ధ్యాస తప్పా యువత కోసం, దేశరక్షణ కోసం, ఆర్థికాభివృద్ధి కోసం పనిచేద్దామన్న సోయి కేంద్రానికి లేదన్నారు. ముందుగా ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయ విద్యార్థులను కాపాడి ఒక సందేశాన్ని దేశ ప్రజలకు, ప్ర పంచానికి అందించాలని సూచించారు.
ఉక్రెయిన్‌లో క ర్ణాటక వాసి చనిపోతే ప్రధాని మోడి కపట ప్రేమ వలకబోస్తున్నారని ధ్వజమెత్తారు. విద్యార్థులను సురక్షితం గా తీసుకొచ్చేందుకు తీసుకుంటున్న చర్యలు ఏమిటో తెలియజేయాలని మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ను డిమాండ్ చేశారు. నోటికొచ్చినట్లు మాట్లాడడం సరికాదన్నారు. పోషించాల్సిన పాత్ర పోషించకుండా ఇంత పెద్దదేశం అంటూ.. గ్లోబల్ ప్రచారాలు చేసుకోవడంలో మోడీ దిట్ట అన్నారు. బీజేపీ మాట వినకపోతే దండయాత్ర, దాడులు చేస్తామని హెచ్చరికలు చేయడం ప్ర జాస్వామ్యానికి శ్రేయస్కరం కాదన్నారు. కమలం పార్టీ నేతలు ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా సీఎం కేసీఆర్ వెనుకడుగు వేయరని స్పష్టం చేశారు. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ నర్సింహాగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు రాజేశ్వర్‌రెడ్డి, మైనార్టీ నా యకులు అమినొద్దీన్, సర్పంచ్ లోక్యానాయక్, నాయకులు పులిజాల రమేశ్, వెంకటేశ్, డాక్టర్ విష్ణుమూర్తి, బంగార్రాజు, తిరుపతి యాదవ్, ప్రవీణ్, వంశీ, సోమ్లా, ఆంజనేయులు, కౌన్సిలర్లు గడ్డం రమేశ్, రమేశ్‌రావు, కుత్బుద్దీన్, సతీశ్, ప్రతాప్‌రెడ్డి, సేవ్య, కిషన్, హుస్సేన్, బాలరాజు తదితరులు పాల్గొన్నారు.