రాజకీయ లబ్ధికోసమే ఎంపీ, ఎమ్మెల్యేపై ఆరోపణలు : టీఆర్ఎస్ నాయకులు
గండీడ్/మహ్మదాబాద్, ఫిబ్రవరి 28 : రాజకీయ లబ్ధికోసం ఎంపీ, ఎమ్మెల్యేపై అసత్య ఆరోపణలు చేస్తున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డికి గుణపాఠం తప్పదని టీఆర్ఎస్ నాయకులు అన్నారు. గండీడ్‌లో సోమవారం ఏర్పాటు చేసి న విలేకరుల సమావేశంలో జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షులు పెంట్యానాయక్, భిక్షపతి మాట్లాడారు. చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డిపై రేవంత్‌రెడ్డి వ్యక్తిగత విమర్శలు చేయ డం సరికాదన్నారు. ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డిపై చేసిన ఆరోపణలకు ఆధారాలు చూపాలని డి మాండ్ చేశారు. రేవంత్‌రెడ్డి గతం మర్చిపోయి మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. దమ్ముంటే కొడంగల్‌లో పోటీ చేయాలని.. పరిగి ప్రజల మద్దతుతో ఓడించి తీరుతామన్నారు. కాంగ్రెస్ పార్టీ హయాంలో మర్రి చెన్నారెడ్డి రెండుమార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినా ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు ఒరిగిందేమీలేదన్నారు. మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పరిగికి రైల్వేలైన్, ప్రాణహిత చేవెళ్ల నీళ్లు అని నియోజకవర్గ ప్రజలను మోసం చేశారన్నారు. రేవంత్‌రెడ్డి నిజనిజాలను తెలుసుకొని మాట్లాడాలని హితవు పలికారు. నోరుందికదా అని ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే సహించమన్నారు. సమావేశంలో పీఏసీసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ. డైరెక్టర్ వెంకటయ్య, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గోపాల్, సర్పంచులు వెంకట్రాంరెడ్డి, కిరణ్‌కుమార్‌రెడ్డి, బాలాజీ, రాఘవేందర్‌రెడ్డి, ర వీందర్నాయక్, టీఆర్ఎస్ యూత్ అధ్యక్షుడు వెంకట్రాములు, నాయకులు గోపాల్‌రెడ్డి, రాజ్‌కుమార్‌రెడ్డి, రాంరెడ్డి, రాంచంద్రారెడ్డి, వెంకటయ్య, రాములు, తిర్మల్‌రెడ్డి, ఖాదర్, హతీక్, నాగేశ్, దశరథ్, మాణిక్యం ఉన్నారు.