పాఠశాలల్లో వైజ్ఞానిక ప్రదర్శనలు
ఘనంగా జాతీయ సైన్స్ దినోత్సవం
విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు
ప్రతిభ కనబర్చిన వారికి బహుమతుల ప్రదానం
ఊట్కూర్, ఫిబ్రవరి 28 :విజ్ఞానంతోనే మానవ వికాసం సాధ్యమని, విద్యార్థులు సైన్స్‌పై పట్టు సాధించాలని, తద్వా రా శాస్త్రవేత్తలుగా ఎదగాలని ఎంఈవో వెంకటయ్య, కాంప్లె క్స్ హెచ్ఎం సురేశ్ అన్నారు. జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలవ్యాప్తంగా ప్రభుత్వ ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల్లో సోమవారం సైన్స్ మేళా నిర్వహించారు. విద్యార్థులు విజ్ఞానమేళా ప్రదర్శనలతో చూపరులను ఆకట్టుకున్నారు. శాస్త్ర పితామహులు, భారత రత్న అవార్డు గ్రహీత సర్ సీవీ రామన్, అబ్దుల్ కలామ్ ఆ జాద్ను ఆదర్శంగా తీసుకొని విద్యార్థులు గొప్ప శాస్త్రవే త్త లు కావాలని సూచించారు. ఆయా పాఠశాలల్లో విద్యార్థులకు వ్యాసరచన, ఉపన్యాస పోటీలు నిర్వహించి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయు లు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
ఆకట్టుకున్న ప్రయోగాలు
నారాయణపేట టౌన్, ఫిబ్రవరి 28 : జాతీయ సైన్స్ ది నోత్సవాన్ని పట్టణంలోని పలు పాఠశాలల్లో ఘనంగా జరుపుకొన్నారు. శ్రీసాయి హైస్కూల్లో విద్యార్థులు చేసిన ప్ర యోగాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. డ్రోన్ల ద్వారా పంట పొలాలకు మందులు పిచికారీ చేయడం, బిందు సేద్యంతో పంటలు పండించే విధానం, అగ్నిపర్వతం నుంచి లావా వెలువడే విధానం తదితర అంశాలపై విద్యార్థులు చేసిన ప్ర యోగాలు ఆకట్టుకున్నాయి. పాఠశాల ప్రిన్సిపాల్ శశికాంత్, ఉపాధ్యాయులు ప్రయోగాలు చేసిన విద్యార్థులను అభినందించారు. అదేవిధంగా పట్టణంలోని సింగార్భేస్లో ఉన్న సరస్వతీ శిశుమందిర్ ఉన్నత పాఠశాలలో, మైనార్టీ గురుకుల, కృష్ణవేణి హైస్కూల్లో విద్యార్థులు సైన్స్ ప్రయోగాలతో ప్రదర్శన నిర్వహించారు.
సీవీ రామన్‌కు నివాళి
కృష్ణ, ఫిబ్రవరి 28 : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండలంలోని గుడెబల్ల్లూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సోమవారం సీవీ రామన్ చిత్రపటాని కి పూలమాల వేసి నివాళులర్పించారు. వి ద్యార్థులు తయారు చేసిన పరిశోధనల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నారు. ప్రతి భ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశా రు. కార్యక్రమంలో పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఉ పాధ్యాయులుం, విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులు శాస్త్రవేత్తలుగా ఎదగాలి
మాగనూర్, ఫిబ్రవరి 28 : మండలంలోని కాస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్వో రాధిక మాట్లాడుతూ విద్యార్థులు గొప్ప శాస్త్రవేత్తలు గా ఎదగాలని సూచించారు. పలువురి శాస్త్రవేత్తల జీవిత చ రిత్ర వెలుగులోకి తెచ్చిన ప్రయోగాలను గురించి తెలియజేశారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
నూతన ఆవిష్కరణలపై ఆసక్తి చూపాలి
నర్వ, ఫిబ్రవరి 28 : మండలంలోని నర్వ, లంకాల, జ క్కన్నపల్లి తదితర గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో జాతీ య సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు పరిజ్ఞానం, సృజనాత్మక మేధస్సుతో రూపొందించిన సైన్స్, గణిత ఆవిష్కరణలను ప్రదర్శించారు. ఈ సందర్భం గా ఉపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులు సృజనాత్మక శక్తితో ఆలోచించి నూతన ప్రయోగాలు చే స్తూ కొత్త ఆవిష్కరణలపై ఆసక్తి చూపాలని సూచించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయు లు, విద్యార్థులు పాల్గొన్నారు.
నిరంతర పరిశోధనలతోనే మనుగడ సాధ్యం
మద్దూర్, ఫిబ్రవరి 28 : సైన్స్ అభివృద్ధితోనే మానవ మనుగడ సాధ్యమని పట్టణంలోని జెడ్పీహెచ్ఎస్ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఆర్.ఆంజనేయులు అన్నారు. సోమవారం జా తీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని విద్యార్థులు సైన్స్‌కు సంబంధించిన వివిధ ప్రయోగాలను తయారు చేసి ప్రదర్శించారు. ఉపాధ్యాయులు పరిశీలించి ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
దేశ భవిష్యత్తు సైన్స్‌పై ఆధారపడి ఉంది
కోస్గి, ఫిబ్రవరి 28 : జాతీయ సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని స్థానిక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సో మవారం పాఠశాలలో 9, 10వ తరగతి విద్యార్థులు తయా రు చేసిన పరిశోధనల ప్రదర్శనలు చూపరులను ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా ఉపాధ్యాయుడు రవీందర్‌రెడ్డి మాట్లాడుతూ దేశ భవిష్యత్తు సైన్స్‌పై ఆధారపడి ఉందని, రోజురోజుకూ శాస్త్ర పరిజ్ఞానం అభివృద్ధి చెందుతుందన్నా రు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
ఘనంగా సైన్స్ దినోత్సవం
నారాయణపేట రూరల్, ఫిబ్రవరి 28 : జిల్లాలోని డీఈ వో కార్యాలయంతోపాటు మండలంలోని వివిధ గ్రామాల పాఠశాలల్లో సోమవారం జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘ నంగా నిర్వహించారు. సీవీ రామన్ చిత్రపటానికి డీఈవో డాక్టర్ లియాఖత్ అలీ పూలమాల వేసి నివాళులర్పించారు. హంసవాహిని ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు క్విజ్ పో టీలు నిర్వహించారు. మండలంలోని లక్ష్మీపూర్ ప్రాథమిక పాఠశాలలో సైన్స్ పరికరాలను ప్రదర్శించి సైన్స్‌పై విద్యార్థులకు అవగాహన కల్పించారు. జాజాపూర్ ఉన్నత పాఠశాలలో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఏఎంవో విద్యాసాగర్, పద్మనళిని, రాజేంద్రకుమార్, భానుప్రకాశ్ పాల్గొన్నారు.