మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి
జడ్చర్లటౌన్, ఫిబ్రవరి 28 : టైలరింగ్ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్న పేద టైలర్ల ను అన్నివిధాలా ఆదుకుంటామని మున్సిపల్ చైర్పర్సన్ లక్ష్మి అన్నారు. టైలరింగ్ దినోత్సవాన్ని జడ్చర్లలోని కౌషిగుట్ట వద్ద టైలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యం లో ఘనంగా నిర్వహించారు. టైలరింగ్ పి తామహుడి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ము న్సిపల్ వైస్‌చైర్‌పర్సన్ సారిక, కౌన్సిలర్ చై తన్యచౌహాన్, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎండీ.కుద్దూస్, జిల్లా గౌరవాధ్యక్షుడు రామచంద్రయ్య, స్వామి, గౌస్, హబీబ్, శ్రీనివాసులు, కృ ష్ణవేణి, నీరజమ్మ, బాలమణి పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, ఫిబ్రవరి 28: మండలకేంద్రంలో అంతర్జాతీయ టైలర్స్డే వేడుకలను ఘనంగా జ రుపుకొన్నారు. టైలర్లు కేక్ కట్ చేశారు. కార్యక్రమంలోరాజు, బాలు, పాషాబాయ్, బక్కన్న, రవికుమార్, చంద్రమౌళి పాల్గొన్నారు.
మిడ్జిల్ మండలంలో..
మిడ్జిల్, ఫిబ్రవరి 28 : మండలకేంద్రంలో టైల ర్స్ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకొన్నారు. టైల ర్స్ అసోసియేషన్ నాయకులు కేక్ కట్ చేసి వేడుకలు నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీటీసీ గౌస్, వెంకట్‌రెడ్డి, అల్వాల్‌రెడ్డి, రాజేశ్వర్, ఆదా మ్, టైలర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీనివాస్, యాదయ్య, రమేశ్, నర్సింహ, సద్దామ్, జంగ య్య, నారాయణ, ఆచారి, తిరుపతి, నాగరాజు, సలీమ్, ప్రశాంత్, సంజీవరెడ్డి, శేఖర్పాల్గొన్నారు.