ఆహ్లాదకరమైన వాతావరణానికి నెలవు
జూరాల హైస్కూల్లో నూతన ఒరవడికి శ్రీకారం
ఆంగ్లంపై ఆసక్తి కల్పిస్తున్న ఉపాధ్యాయుడు సంతోష్
డిజిటలైజేషన్‌కే కొత్త పుంతలు అద్దుతున్న పంతులు
విద్యార్థులకు అర్థమయ్యే రీతిలో బోధన
ఆదర్శ బాటలో సంకాపురం సరస్వతీ నిలయం
‘మన ఊరు-మన బడి’, మన బస్తీ-మన బడి’తో మరిన్ని మౌలిక సౌకర్యాల కల్పన
ఆత్మకూరు, ఫిబ్రవరి 26 : సర్కార్ బడులు కార్పొరేట్‌కు దీటుగా నిలుస్తున్నాయి. సీఎం కేసీఆర్ విద్యా రంగానికి పెద్దపీట వేయడంతో విద్యార్థులకు మెరుగైన బోధన అందుతున్నది. పచ్చని చెట్లతో ఆహ్లాదకర వాతావరణానికి నెలవుగా మారాయి. ఇదే కోవలోకి ఆత్మకూరు మండలం జూరాల హైస్కూల్ కూడా చేరుతుంది. పాఠ్యాంశాల బోధనలో ప్రత్యేకతను చాటుతూ విద్యావ్యవస్థకే కొత్తదనాన్ని పరిచయం చేస్తున్నాడు .. ఉపాధ్యాయుడు సంతోష్. స్మార్ట్‌క్లాస్, డిజిటల్ క్లాస్‌లకే కొత్త పుంతలు అద్దుతూ బోధనా పద్ధతికే వన్నెతెస్తున్నాడు.. ఆంగ్లంపై స్టూడెంట్స్‌కు ఆసక్తి కలిగేలా సులభంగా.. అర్థమయ్యే రీతిలో బోధన కొనసాగిస్తున్నాడు. సొంత అద్భుతాలతో బోధనా శైలితో ఆకట్టుకుంటున్నాడు. అలాగే అయిజ మండలం సంకాపురంలోని పాఠశాల కూడా ఆదర్శ బాటలో పయనిస్తున్నది. హెచ్ఎం చొరవతో సూపర్ బోధన
అందుతున్నది. ‘మన ఊరు-మన బడి’, మన బస్తీ-మన బడి’తో ప్రభుత్వం మరిన్ని మౌలిక సౌకర్యాలు కల్పించనుండడంతో బడులు బలోపేతం కానున్నాయి.
మూసధోరణి పాఠ్యాంశాల బోధనకు స్వస్తి పలుకుతూ ఉపాధ్యాయుడు మచాలే సంతోష్‌కుమార్ నూతన ఒరవడికి నాంది పలుకుతున్నాడు. సంతోష్‌కుమార్ మండలంలోని జూరాల ఉన్నత పాఠశాలలో ఇంగ్లిష్ ఉపాధ్యాయుడిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. స్మార్ట్, డిజిటల్ క్లాస్‌లకు కొత్త పుంతలు అద్దుతూ బోధనా పద్ధతికి వన్నె తెస్తున్నారు. ఆంగ్లం సబ్జెక్టును విద్యార్థులకు ఇష్టంగా మారుస్తున్నాడు. పాఠాలను బోధించడమే తన వృత్తి అనుకోకుండా..విద్యార్థుల మూలాల్లోకి వెళ్లి నేర్పిస్తున్నాడు. ఆంగ్లంలో ప్రావీణ్యాన్ని చాటుతూ పాఠశాలకు, జిల్లాకు పేరు తెస్తునారు. విద్యార్థుల అభిరుచికి తగినట్లుగా కదిలే చిత్రాలతో వీడియో రూపకంగా పాఠ్యాంశాల బోధనకు శ్రీకారం చుట్టాడు. పిల్లలకు అర్థమయ్యేలా, ఆసక్తి కలిగించేలా బోధిస్తూ ఆంగ్లం సబ్జక్టును సరళం చేస్తున్నాడు. తరగతి గదిని ఆంగ్ల ప్రయోగశాలగా మార్చాడు.
స్వయంకృషితో డిజిటల్ బోధన..
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోనే మొట్టమొదటి స్మార్ట్ క్లాస్‌ను జూరాల పాఠశాలలో సంతోష్‌కుమార్ ఏర్పాటు చేశారు. ఆయన తన సొంత ఖర్చులతో రూపొందించుకున్న తరగతి గదిని అప్పటి కలెక్టర్ టీకే శ్రీదేవి సందర్శించారు. విద్యార్థులను ప్రోత్సహించే దిశలో డిజిటల్ క్లాస్‌రూమ్‌కు సహకారం అందించారు. పదేండ్ల కిందటే డిజిటల్ క్లాస్‌లు చెప్పిన సంతోష్‌కుమార్.. తన విద్యాబోధనలో మార్పులు జోడించాడు. స్వతహాగా కంప్యూటర్ పరిజ్ఞానం ఉండడంతో విద్యార్థులకు ప్రొజెక్టర్ క్లాస్‌లు నిర్వహిస్తున్నాడు. స్వతహాగా డిజిటల్ లర్నింగ్ ల్యాబ్‌ను ఏర్పాటుచేసుకున్నాడు.
కరోనా నేపథ్యలో డిజిటల్ చదువులకు అలవాటు పడిన విద్యార్థులకు.. తరగతి గదిలోనూ అదే వాతావరణాన్ని కల్పిస్తూ కదిలే బొమ్మల ద్వారా పా ఠాలు బోధిస్తున్నాడు. పాఠ్యాంశం మొత్తం ైస్లెడ్ షోతో ప్రదర్శననిస్తున్నాడు. అంతేకాకుండా ఈ పా ఠశాలలో ఇంగ్లిష్ ల్యాబ్ ఆకట్టుకుంటున్నది. ఇందు లో ఆంగ్ల అక్షరాలు, పదాలు, గ్రామర్, సూక్తులు, పాఠ్యాంశాలు, గేమ్స్‌లకు సంబంధించిన మెటీరియల్ ఉన్నాయి. విషయ పరిజ్ఞానం జ్ఞప్తికి వచ్చేలా రూపొందించిన ల్యాబ్ విద్యార్థులను నిత్యవిద్యార్థిగా మలిచేందుకు ఉపకరిస్తున్నది. ఈ పాఠశాలలో ని విద్యార్థుల చేతిరాతపై సంతోష్‌కుమార్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. సొంతంగా సిద్ధం చేసిన వ ర్క్షీట్స్తో చేతిరాత నైపుణ్యాన్ని పెంపొందిస్తున్నారు. తరగతిలో ఉన్న విద్యార్థులందరి చేతిరాత ఒకే మాదిరి ఉం డడం విశేషం.
అర్థమయ్యేలా బోధించాలి..
డిజిటల్ మాధ్యమాలకు అలవాటు పడిన వి ద్యార్థులకు అర్థమయ్యేలా బోధించాలి. ప్రొజెక్టర్ ద్వారా డిజిటల్ క్లాసుల్లో కదిలే బొమ్మలతో పాఠా లు చెబుతున్నాం. విషయ పరిజ్ఞానం, కదిలే చి త్రాల వీడియో, మాతృభాషతోపాటు ఆంగ్లంలో అర్థమయ్యేలా అక్షరాలు రాయడం, మూడింటినీ కలిపి స్క్రీన్‌పై చూయిస్తూ బోధించడం ప్రత్యేకత. పోస్టర్లు, డ్రాయింగ్ షీట్స్ అవసరం లేకుండా స్వ తహాగా చేసుకున్న ైస్లెడ్షోతో చెబుతున్నాం.
– సంతోష్‌కుమార్, ఎస్ఏ ఇంగ్లిష్, జూరాల ఉన్నత పాఠశాల
రాష్ట్ర స్థాయిలో ప్రశంసలు..
సంతోష్‌కుమార్ బోధ నా పద్ధతులపై రాష్ట్ర స్థా యిలో ఎస్సీఈఆర్టీ ప్ర శంసించింది. ఏబీసీ ప్రో గ్రాంలో ఆయన మెళకువలను గుర్తించి యూట్యూ బ్ వీడియోను విడుదల చేసింది. తరగతి గది అలంకరణ, ల్యాబ్, యాక్టివిటీ బోధనా పద్ధతులు బాగున్నాయి. ఇంగ్లిష్ మాత్రమే కాకుండా అన్ని సబ్జెక్టుల నిర్వహణలో ఆయన పద్ధతులను ఉపయోగిస్తూ ఉత్తమ ఫలితాలు సాధిస్తున్నారు. 2017లో జిల్లాలో పదికి పది జీపీఏ సాధించిన ఏకైక ప్రభుత్వ పాఠశాల జూరాల. ఇందులో సంతోష్‌కుమార్ పాత్ర ఎంతో ఉన్నది.
– భాస్కర్‌సింగ్, ఎంఈవో, ఆత్మకూరు