శ్రీశైల క్షేత్రంలో వైభవంగా మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు
రావణ వాహనంపై భ్రామరీ మల్లన్న
కనులపండువగా గ్రామోత్సవం
ఆకట్టుకున్న కళాకారులప్రదర్శనలు
జనసంద్రమైన ఆలయ పరిసరాలు
విద్యుద్దీపాల కాంతుల్లో దివ్యధామం
శ్రీశైలం, ఫిబ్రవరి 26 : శ్రీశైల క్షేత్రంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఐదో రోజైన శనివారం పూ జాధికాలు శాస్ర్తోక్తంగా జరిగాయి. ఉదయం చండీశ్వరపూజ, మండపారాధన, కలశార్చన, శివపంచాక్షరీ జపానుష్ఠానాలు, రుద్రపారాయణాలు, రుద్రహోమం, చండీహోమం నిర్వహించారు. సాయంకాలం స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించిన రావణ వాహనంపై ఉంచి అక్కమహాదేవి అలంకార మండపంలో షోడశోపచార పూజలు నిర్వహించారు. మంగళవాయిద్యాలు, డప్పుచప్పుళ్ల మధ్య క్షేత్ర ప్రధాన వీధుల్లో ఊరేగించా రు. ఉత్సవ అనంతరం కాళరాత్రిపూజ మంత్రపుష్పంతోపాటు ఆస్థానసేవ నిర్వహించారు. రావణ వాహనాధీశుడైన శ్రీశైలేశుడిని దర్శించుకుంటే కష్టాలు తొలగి భక్తులు సుఖ సంతోషాలతో భాసిల్లుతారని ఆలయ స్థా నాచార్యులు పూర్ణానంద ఆరాధ్యులు తెలిపారు. బ్ర హ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం స్వామి, అమ్మవార్లు పుష్పపల్లకీపై విహరించనున్నారు. భ్రామరీ కళావేదిక, పుష్కరిణి, శివదీక్షా శిబిరాల వద్ద ఏర్పాటు చేసిన కూచిపుడి, భరతనాట్యం, హరికథ, బుర్రకథ, భక్తరంజని, నాటికలు ఆకట్టుకుంటున్నాయి. గ్రామోత్సవంలో ఈ వో లవన్న, అసిస్టెంట్ కమిషనర్ నటరాజ్, ఈఈ ముర ళీ బాలకృష్ణ, పౌరసంబంధాల అధికారి శ్రీనివాసరావు, ఏఈవోలు హరిదాస్, ఫణీంద్రప్రసాద్, శ్రీశైల ప్రభ సం పాదకుడు అనిల్‌కుమార్, రెవెన్యూ అధికారి శ్రీహరి, చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్ నర్సింహారెడ్డి, సూపరింటెండెంట్ అయ్యన్న, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
పట్టు వస్ర్తాలు సమర్పించిన ఏపీ సర్కార్..
స్వామి, అమ్మవార్లకు ఈవో లవన్న దంపతులు, సాయంత్రం ఏపీ ప్రభుత్వం స్వామి, అమ్మవారికి పట్టువస్ర్తాలు సమర్పించారు. ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాసరావు, శ్రీశైలం ఎమ్మెల్యే శిల్పాచక్రపాణి రెడ్డితోపాటు రెవెన్యూ, ఆరోగ్య, పోలీస్ శాఖల అధికారులు ఆలయాల్లో పూజలు చేశారు.